Vijayashanti : అందుకే పార్టీ మారా, బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చటాన్ని తాను వ్యతిరేకించానని.. కానీ అధిష్టానం వినలేదని..దానికి కారణం ‘బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Vijayashanti : అందుకే పార్టీ మారా, బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Vijayashanti In Congress

Vijayashanti In Congress : బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతల్ని అప్పగించింది. కాంగ్రెస్ లో చేరిన తరువాత విజయశాంతి తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజయ్ కుమార్ తో కలిసి శనివారం ఆమె మీడియాకు సంచలన విషయాలు వివరించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తు..కేసీఆర్ ను గద్దె దింపటానికి పార్టీ మారానన్నారు. కేసీఆర్ పార్టీలో మీ పార్టీని వీలీనం చేశారు..కేసీఆర్ దేవుడిచ్చిన అన్న అని చెప్పుకున్న మీరు ఆపార్టీలోంచి వచ్చేశారు..తరువాత ఎన్నో పార్టీలు మారారు కాంగ్రెస్, బీజేపీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ..‘కేసీఆర్ దేవుడిచ్చిన అన్న అని తాను చెప్పలేదని..కేసీఆరే తనను దేవుడిచ్చిన చెల్లెలు అని చెప్పారని పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ దోచేస్తున్నారని ఆరోపించారు. తనను దేవుడిచ్చిన చెల్లి అని చెప్పుకుని తనను పార్టీనుంచి సస్పెండ్ చేశారని..తనను మోసం చేయటమేకాదు తెలంగాణలో దోచేస్తున్న కేసీఆర్ ను గద్దె దింపేందుకే పార్టీ మారానని తెలిపారు.

అంతేకాదు ..తాను పార్టీలు మారటానికి కారణం పార్టీలు తనను మోసం చేయటమే తప్ప తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. బీజేపీ కేసీఆర్ ను గద్దె దింపుతుందని..అతని చేసే అవినీతిని ప్రశ్నిస్తుందని ఆశించాను..కానీ అలాంటిదేమీ జరగటంలేదని..తెలంగాణలో కాంగ్రెస్ బలపడింది. కేసీఆర్ ను గద్దె దింపే సత్తా సాధించింది. అందుకే కాంగ్రెస్ లో తిరిగి చేరానని తెలిపారు. నా పాతమిత్రులను కలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు.

Also Read : నన్ను తిట్టటానికే కేసీఆర్ మీటింగ్ పెట్టారు, జనాలంతా బాయ్ చెప్పి వెళ్లి పోయారు : బండి సంజయ్

ఎన్నిలకు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చివేసిందని..దాన్ని తాను వ్యతిరేకించానని.. ఈ సమయంలో అధ్యక్షుల మార్పు సరికాదని సూచించానని.. కానీ అధిష్టానం వినలేదని..దానికి కారణం ‘బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీజేపీలో నాటిన ఆ మొక్క మాటలు నమ్మిన బీజేపీ అధిష్టానం బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తీసివేసిందని అన్నారు. ఇక్కడి పార్టీలో గొడవలు సృష్టిస్తు.. తరచు ఢిల్లీ వెళ్లుతు ఆ మొక్క బీజేపీలో ఎప్పుడు ఏం చేయాలో చేసిందినీ..ఫలితంగానే అధ్యక్షుడి మార్పుకు కారణమైందని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయానికి ఇటువంటి కారణాలు చాలానే ఉన్నాయన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితం..నా రాష్ట్రమే నాకు ముఖ్యం అనుకోని రాజకీయాల్లో ఉన్నాను అని అన్నారు.

కేసీఆర్ ను ఎదిరించడానికే..ఆయన్ని అధికారం నుంచి దింపే సత్తా బీజేపీకి ఉందని నమ్మి వెళ్లాను అని అన్నారు. ఉద్యమకారులను బీజేపీలోకి రావాలని హై కమాండ్ ఆహ్వానించింది..అక్కడికి వెళ్లిన తర్వాత కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మెల్లగా అర్ధమైందన్నారు.ప్రధాని మోదీ కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తారు కానీ చర్యలు మాత్రం తీసుకోవటంలేదు దీనికి కారణం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. మోడీ, అమిత్ షా, నడ్డా వచ్చినప్పుడు విమర్శలు చేయడం, వదిలేయడం తప్ప చర్యలు మాత్రం ఉండటంలేదు అంటూ దుయ్యబట్టారు.

Also Read :  ఇటిక్యాల రోడ్ షోలో సృహ తప్పిన ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలో బీజేపీకి మెజార్టీ వున్నా కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు..? దీనికి ఎవరు బీజేపీని ఆపుతున్నారు..? ఆధారాలు వున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు..?అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థం చేసుకోవాలన్నారు.తెరముందు ఒక్కటి తెరవెనుక మరొకటి నడుస్తోందని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడే బీజేపీ కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేశానని రాములమ్మ వివరించారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని..కేసీఆర్ అవినీతిని కక్కింటం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.