Bandi Sanjay : నన్ను తిట్టటానికే కేసీఆర్ మీటింగ్ పెట్టారు, జనాలంతా బాయ్ చెప్పి వెళ్లి పోయారు : బండి సంజయ్

కరీంనగర్ లో కేసీఆర్ సభ పెట్టింది ఎన్నికల ప్రచారం కోసం కాదు తనను తిట్టటానికే పెట్టారు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు.

Bandi Sanjay : నన్ను తిట్టటానికే కేసీఆర్ మీటింగ్ పెట్టారు, జనాలంతా బాయ్ చెప్పి వెళ్లి పోయారు : బండి సంజయ్

Bandi Sanjay kamanpur

Updated On : November 18, 2023 / 1:02 PM IST

Bandi Sanjay kamanpur : కరీంనగర్ లో కేసీఆర్ సభ పెట్టింది ఎన్నికల ప్రచారం కోసం కాదు తనను తిట్టటానికే పెట్టారు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు. కరీనగర్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ తనను ఇష్టమొచ్చినట్లుగా తిట్టారని..మీటింగ్ పెట్టి కరీంనగర్ కు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పకుండా తనను తిట్టడానికే పెట్టారా..? అంటూ ప్రశ్నించారు.

కమాన్ పూర్ లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా బండి సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. గతంలో కేసీఆర్ తనను తలను ఆరు ముక్కలు చేస్తానన్నారని ఎందుకంటే కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు అందుకే తన తలను ఆరు ముక్కలు చేస్తానన్నారు అని బండి అన్నారు. దీంతో అక్కడున్నవారంత నవ్వారు. దీంతో బండి మరింత జోష్ గా కరీనగర్ లో సీఎం కేసీఆర్ పెట్టిన మీటింగ్ కు జనాలే లేరని మీటింట్ వేదికపై తనను కేసీఆర్ తిడుతుంటే జనాలు నవ్వుకుంటు బాయ్ చెప్పి వెళ్లిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి కీలక బాధ్యతలు

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ఎన్ని ఇచ్చారు? బీసీనీ సీఎంను చేస్తానని మోసం చేశారు..? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా..? ఇలా చెప్పినవి చేయకపోవటే కేసీఆర్ స్టైల్ అంటూ సెటైర్లు వేశారు.

కాగా కరీంనగర్ లో ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ బండి సంజయ్ పై విమర్శలు చేస్తు.. కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ బండి సంజయ్ పై సెటైర్లు వేశారు. కేసీఆర్ సెటైర్లకు బండి ఈరోజు  కరీంనగర్ కమాన్ పూర్ ఎన్నిక ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ డోకాబాజ్ పార్టీ .. పాల్త్ వాగ్దానాలు : సీఎం కేసీఆర్