Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి కీలక బాధ్యతలు

బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి హస్తం పార్టీ అధిష్టానం కీలక బాధ్యతల్ని అప్పగించింది.

Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి కీలక బాధ్యతలు

Vijayashanthi

Updated On : November 18, 2023 / 12:13 PM IST

Vijayashanthi : బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి హస్తం పార్టీ కీలక బాధ్యతల్ని అప్పగించింది. శుక్రవారమే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే..అనంతరం ఒక్కరోజులోనే రాములమ్మకు కాంగ్రెస్ కీలక బాధ్యతల్ని అప్పగించటం విశేషం. బీజేపీలో తనకు తగిన గౌరవం దక్కటంలేదని కొంతకాలంగా ఆమె వాపోయేవారు.పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫోస్టో ప్రకటన..రాములమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఒకేరోజు జరిగాయి.

ఆమెకు తగిన బాధ్యతల్ని అప్పగించి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ.పార్టీలో కీలక పదవీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారం,ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్టినేటర్ గా నియమించింది. విజయశాంతిని చీఫ్ కో ఆర్డినేటర్ గా నియమిస్తు కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించింది కాంగ్రెస్. ఈ లిస్టులో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్,రాములు నాయక్,పిట్ల నాగేశ్వరరావు, ఓబేదుల కొత్తవాల్, రమేశ్ ముదిరాజ్, పారిజాత రెడ్డి,సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్ పాటు పలువురు ఉన్నారు.