CM KCR : కాంగ్రెస్ డోకాబాజ్ పార్టీ .. పాల్త్ వాగ్దానాలు : సీఎం కేసీఆర్

కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ సెటైర్లు వేశారు.

CM KCR : కాంగ్రెస్ డోకాబాజ్ పార్టీ .. పాల్త్ వాగ్దానాలు : సీఎం కేసీఆర్

CM KCR

Karimnagar BRS Praja Ashirwada Sabha : కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డోకాబాజ్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. 1969లో నాలుగు వందల మందిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని అమరణ నిరాహార దీక్షకి కూడా కరీనగర్ వేదికగానే బీజం పడిందన్నారు. ఒకప్పుడు ఉన్న కరీంనగర్ కు ఇప్పటికి చాలా తేడా వచ్చిందని ఇప్పుడు కరీంనగర్ అద్దంలాగా తయ్యారైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆదాయం పెరిగిందని..తలసరి‌ అదాయం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణయే నంబర్ వన్ గా ఉందని అన్నారు.

ఎలక్షన్ వచ్చిందంటే పాల్త్ వాగ్దానాలు ఇస్తారు అటువంటి పార్టీలను నమ్మొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. పోటిలో ఉన్న అభ్యర్థుల గుణగణాలు గుర్తించి ఓటు వేయాలని సూచించారు.తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో సాగునీరుగానీ త్రాగునీరు లేదు అటువంటిది ఈరోజున సాగు,తాగు నీటి కష్టాలను తీర్చుకున్నామన్నారు. నీటి ప్రాజెక్టులతో పంటల్ని పెంచుకుని రైతులు తమ ఆదాయాలను పెంచకుంటున్నారని ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలో వచ్చినవేనన్నారు.

Also Read :వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. తెలంగాణ ప్రజలకి గుండెపోటే : హరీశ్ రావు

భారతదేశ చరిత్రలోనే వందల రూపాయల‌ పింఛన్ ని వేల రూపాయలకి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనే విషయం మర్చిపోవద్దన్నారు. భూమి తగాదాలు లేకుండా ధరణి పొర్టల్ లు అమలులోకి తెచ్చామని..ధరణి వచ్చాక భూ తగాదాలు తగ్గాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ధరణి బంగాళఖాతంలో కలిపేస్తుంది అన్నారు .రైతు బంధు పథకాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.  కాబట్టి అందరు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మానేరు రివర్ ప్రంట్ పూర్తి అయ్యితే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఇటువంటి అభివృద్ది పనులు మరిన్ని చేసుకుందామని సూచించారు. 24 గంటలు నీటి సరఫరా అయ్యే ప్రణాళికలు రూపొందించామని.. అవన్నీ అమలు చేసేందుకు మరోసారి గెలిపించాలని కోరారు.

Also Read : Bandi Sanjay : ఓడితే కేసీఆర్‌ను కేటీఆర్ వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు : బండి సంజయ్

మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వేమనని ధీమా వ్యక్తంచేసిన కేసీఆర్ బీజేపీకి మతపిచ్చి తప్ప ఇంకేమీ తెలియదు అంటూ విమర్శించారు.వంద ఉత్తరాలు రాస్తే మెడికల్ కాలేజ్ ‌ఇవ్వలేదు..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నాలుగు గవర్నమెంట్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు.తెలంగాణలో జిల్లాకొకటి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్న ఘనత తమదేనన్నారు. కరీంనగర్ ఎంపీకి మసీదులు తవ్వుదామా..?గుడులు తవ్వుదామా..? అనే ధ్యాసే తప్ప రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించటం తెలీదు అంటూ బండి సంజయ్ పై సెటైర్లు వేశారు.