Harish Rao : వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే .. తెలంగాణ ప్రజలకు గుండెపోటే : హరీశ్ రావు

కడుపులో చిచ్చు పెట్టి..కళ్లు తుడవ వస్తారా..?చంపిన వారే. సారీ చెప్తున్నారు మండిపడ్డారు.హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉందంటూ విమర్శించారు.

Harish Rao : వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే .. తెలంగాణ ప్రజలకు గుండెపోటే : హరీశ్ రావు

Minister Harish Rao

Updated On : November 17, 2023 / 3:09 PM IST

Minister Harish Rao Counter to Congress : కర్ణాటకలో మాట్లాడిన జూటా మాటలనే రాహుల్ గాంధీ తెలంగాణలో మాట్లాడుతున్నారు అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో పథకాలు అమలు చేయమంటే ఖజానా ఖాళీ అంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో స్కాలర్ షిప్పుల్లో కూడా కోత విధించారని విమర్శించారు.కర్ణాటకలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు… పథకాల అమలుకు నిధులు లేవని ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారని..కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 357 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారంటూ విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ రైతును రాజుని చేసిన పార్టీ అన్నారు. కానీ కర్ణాటకలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ఆరోపించారు. కర్ణాటకలో ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. అక్కడ యువశక్తి పథకానికి దిక్కేలేదు అంటూ ఎద్దేవా చేశారు.కర్ణాటక ప్రజల బాధ.. తెలంగాణ ప్రజలకు రావొద్దన్నారు.రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యారు అంటూ సెటైర్లు వేశారు. రాహుల్ కి దమ్ముంటే కర్ణాటక మోడల్ తో ఓట్లు అడగాలి అని సవాల్ చేశారు. వెన్నుపోటు కాంగ్రెస్ ను నమ్ముకుంటే.. తెలంగాణ ప్రజలకి గుండెపోటు అంటూ విమర్శించారు. ఓట్ల కోసం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.

కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ నిర్మించినవే : రాహుల్ గాంధీ

చిదంబరం వ్యాఖ్యలు చూస్తే.. కడుపులో చిచ్చు పెట్టి..కళ్లు తుడవ వస్తారా అనే కాళోజీ మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు.చంపిన వారే. సారీ చెప్తున్నారు మండిపడ్డారు.చిదంబరం తీరు ఎలా ఉంది అంటే..హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉంది అంటూ విమర్శించారు.స్వాతంత్రం పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన జనరల్ డయ్యర్ క్షమాపణ చెప్పినట్లుగా ఉందన్నారు.ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదు..అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ బిడ్డలకు చిదంబరం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.