Rahul Gandhi : కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ నిర్మించినవే : రాహుల్ గాంధీ

తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.

Rahul Gandhi : కేసీఆర్ చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ నిర్మించినవే : రాహుల్ గాంధీ

Rahul Gandhi (4)

Updated On : November 17, 2023 / 4:36 PM IST

Congress Leader Rahul Gandhi : తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని సీఎం కేసీఆర్ అడుగుతున్నాడని ఆయన చదువుకున్న పాఠశాల, కళాశాలను కాంగ్రెస్ నిర్మించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ యువశక్తిని కూడా నిర్మించిందని తెలిపారు. తెలంగాణ డబ్బులు దోచి నిర్మించిన దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగతుందన్నారు. తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని, మాట్లాడారు. ప్రజల తెలంగాణ అని కలలు కంటే సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుందన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించానని, లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు.  లక్షల కోట్ల అవినీతి డబ్బులను తిరిగి కక్కిస్తానని చెప్పారు.

Also Read : అసైన్డ్ భూములపై పేదలకే పూర్తి హక్కులు : సీఎం జగన్

రూ.500లకే గ్యాస్ సిలిండర్,  మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం..

ఆరు గ్యారంటీలు ఇచ్చామని, గ్యాస్ సిలిండర్ కొద్ది రోజులలో రూ.500లకే రాబోతుందన్నారు. మహిళలకు రూ.2500 ప్రతి నెల అకౌంట్ లో వేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో మహిళలు బస్సు టిక్కెట్ కొని ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బస్సు టిక్కెట్ మహిళలు కొనాల్సిన అవసరం లేదని, ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రతి సంవత్సరానికి ప్రతి రైతుకు రూ.1500 ఇస్తామని తెలిపారు.

గృహజ్యోతి పథకం కింద 200 మెగావాట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ 24 గంటల కరెంటు వస్తుందా.. ఆ 24 గంటలు కరెంట్ కేసీఆర్ ఇంటికి మాత్రామే వస్తుందని విమర్శించారు. వృద్ధులకు చేయూత పథకం కింద రూ.4000 ఫించన్ ఇస్తామని వెల్లడించారు. గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం అమలు చేస్తారని తెలిపారు.

Also Read: తెలంగాణలో మూడు పార్టీల కీలకనేతల మధ్య ఆసక్తికర పోరు

కుల గణన చేపడుతాం, స్థానిక సంస్థలలో 43 శాతం రిజర్వేషన్లు అమలు..

కేసీఆర్ లా అబద్దాలు చెప్పామని, కాంగ్రెస్ చెబితే తప్పకుండా అమలు చేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుల గణన చేపడుతామని, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను 43 శాతం అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, కుటుంబ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ధరణీ పేరుతో 20 లక్షల మంది భూములను మోసం చేశాడని విమర్శించారు. ప్రజలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు.

మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సబ్బండ వర్గాల ప్రజలుకు భూములు పంచుతామని చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నాడు కేసీఆర్.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణను ఇచ్చింది మీ కుటుంబం కోసం కాదు ప్రజలకు కోసమని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పార్లమెంటులో బీజేపీకి అన్ని విషయాలలో మద్దతు ఇచ్చారని తెలిపారు.

Also Read : తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ కొత్త వరాలు.. ఆరు గ్యారంటీలకు తోడు కొత్త పథకాలు

బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్న బీజేపీ, ఎంఐఎం..

బీజేపీ, ఎంఐఎం రెండు బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, ఎంఐఎం ఢిల్లీలో చెట్టాపట్టాలు వేసుకుంటూ తెలంగాణలో గొడవలు పడ్డట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని స్పష్టం చేశారు.