Congress New Manifesto : తెలంగాణ ప్రజలకు టీ కాంగ్రెస్ కొత్త వరాలు.. ఆరు గ్యారంటీలకు తోడు కొత్త పథకాలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి స్థానంలో భూ భారతి పేరు అప్ గ్రేడ్ యాప్ తీసుకొస్తామని చెబుతోంది. ఇక గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనంతోపాటు రేషన్ డీలర్లు కు గౌరవ వేతనంతో పాటు కమీషన్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది.

Telangana Congress Election Manifesto
Telangana Congress New Manifesto : ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారంటీలకు తోడు మ్యానిఫెస్టోలో కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలకు తోడుగా ఇప్పుడు మ్యానిఫెస్టో ప్రకటించనున్న కొత్త అంశాలు కూడా ఆసస్తికరంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో నేడు విడుదల కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో మ్యానిఫెస్టోలో విడుదల చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి స్థానంలో భూ భారతి పేరు అప్ గ్రేడ్ యాప్ తీసుకొస్తామని చెబుతోంది. ఇక గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనంతోపాటు రేషన్ డీలర్లు కు గౌరవ వేతనంతో పాటు కమీషన్ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో దీనిపై కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంది.
Top Headlines : కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ఉత్కంఠ, ఢిల్లీ అగ్రనేతల పర్యటనలతో హీటెక్కుతున్న తెలంగాణ
అభయ హస్తం పథకాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. ఆర్ఎంపీ, పీఏంపీలకు గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఏపీ తరహా గ్రామ వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు వంటి కొన్ని కీలక అంశాలను కొత్తగా మ్యానిఫెస్టోలో చేర్చారు.