Top Headlines : కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ఉత్కంఠ, ఢిల్లీ అగ్రనేతల పర్యటనలతో హీటెక్కుతున్న తెలంగాణ

మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

Top Headlines : కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ఉత్కంఠ, ఢిల్లీ అగ్రనేతల పర్యటనలతో హీటెక్కుతున్న తెలంగాణ

Headlines-10am

Updated On : November 17, 2023 / 11:35 AM IST

హస్తం వరాలు..
మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కానుంది. ఆరు గ్యారెంటీలకు తోడు మరిన్ని హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎన్నికల మేనిఫెస్టో ఖర్గే విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు కీలక అంశాలను పొందుపర్చారు. గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లు కు గౌరవ వేతనం తో పాటు కమీషన్, అభయ హస్తం పథకాన్ని తిరిగి పునరుద్ధరణ, ఆర్ఎంపీ, పీఏంపీలకు గుర్తింపు కార్డు, అమ్మహస్తం పేరు తో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎంబీసీ లకు ప్రత్యేక కార్పోరేషన్, ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్ వంటి అంశాలు ఓటర్లను ఆకట్టుకోనున్నాయా..లేదో వేచి చూడాలి.. Read More

రంగంలోకి రాహుల్‌..
నేడు తెలంగాణలో రాహుల్‌ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లతో రాహుల్ గాంధీ ఈరోజు అంతా బిజీ బిజీగా గడపనున్నారు… Read More

షా వస్తున్నారు..
తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచారాలను ప్రతీ పార్టీ ముమ్మరం చేసింది. ఓ పక్క టీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్ అగ్రనేతలు, ఇంకోపక్క ఢిల్లీ కాషాయ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా బీజేపీ అగ్రనేత,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా షా హైదరాబాద్‌కు రానున్నారు..అలాగే రేపు మూడుచోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు… Read More

గులాబీ బాస్ సుడిగాలి పర్యటన..
రోజుకు రెండు మూడు సభలతో హోరెత్తిస్తున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ..ఈరోజు అంతకు మించి అన్నట్లుగా నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. తనదైన శైలిలో సభల్లో ప్రసంగించనున్నారు.

గులాబీ షో..
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు..అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివద్దిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. దీంట్లో భాగంగా కేటీఆర్ ఈరోజు హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు.

ఐటీ హీట్‌..
ఓ పక్క ఎన్నికల వేడి..మరోపక్క తెలంగాణలో ఐటీ సోదాలు మరింత హీటెక్కిస్తున్నాయి. దీంట్లో భాగంగా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రైస్ మిల్లర్స్, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.

ఫైబర్‌ గ్రిడ్ కేసు..
ఏపీ ఫైబర్‌ గ్రిడ్ కేసుపై ఇవాళ ACB కోర్టులో విచారణ జరుగనుంది.అస్తులు అటాచ్‌మెంట్ చేయాలని సీఐడీ పిటిషన్ వంటి అంశాలపై విచారణ జరుగనుంది.

తుపాను గండం..
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం మరింత తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

పోలింగ్‌ టైమ్‌..
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ జరుగనుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

ఎలా ఉన్నారు..?
ఇంకా సొరంగంలోనే 40 మంది కార్మికులు ఉన్నారు. దీంతో వారి క్షేమం గురించి ఆందోళన కొనసాగుతోంది.కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూకు ఆటంకాలు కలుగుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.

జింబాబ్వేలో ఘోర రోడ్డుప్రమాదం..
జింబాబ్వేలో ఘోరం ప్రమాదం సంభవించింది. మినీబస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు.

ఫైనల్‌ ఫైట్‌..
దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. ఈనెల 19న వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్ జరుగనుంది. దీంతో గెలుపుపై క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసిక్ జట్టు భారత్‌తో తలపడనుంది.