Telangana assembly election : తెలంగాణలో రాహుల్, అమిత్ షా పోటాపోటీ ప్రచారం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రచార పర్వంలో దిగనున్నారు. ఒకేరోజు రాహుల్, అమిత్ షాలు తెలంగాణకు వస్తుండటంతో ఆయా పార్టీల్లో ప్రచార హోరు పెరిగింది.....

Telangana assembly election : తెలంగాణలో రాహుల్, అమిత్ షా పోటాపోటీ ప్రచారం

Rahul and Amit Shah

Telangana assembly election : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రచార పర్వంలో దిగనున్నారు. ఒకేరోజు రాహుల్, అమిత్ షాలు తెలంగాణకు వస్తుండటంతో ఆయా పార్టీల్లో ప్రచార హోరు పెరిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. రాహుల్ శుక్రవారం రాజేంద్రనగర్, వరంగల్ ఈస్ట్, వెస్ట్, నర్సంపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, పాదయాత్ర చేస్తున్నారు.

రాహుల్ సుడిగాలి పర్యటన

రోజుకు అయిదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ తిరిగి ప్రచారం చేయనున్నారు. రాహుల్ శనివారం నాటి నుంచి ఐదు రోజులపాటు సాగించే ప్రచార షెడ్యూల్ ను గాంధీ భవన్ వర్గాలు ఖరారు చేయనున్నాయి. రాహుల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టరులో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వరంగల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో రాహుల్ వస్తూ ప్రచారం చేయనున్నారు. రాహుల్, అమిత్ షా వరంగల్ ప్రాంతంలో ఒక రోజు తేడాతో ప్రచారం చేయనున్నారు.

బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న అమిత్ షా

తెలంగాణలో బీజేపీ కూడా ప్రచార రంగంలో కేంద్ర నేతలను దించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి 10గంటలకు బేగంపేట విమానాశ్రయానకి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్ కు చేరి రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10:30గంటలకు హోటల్ కత్రియకు అమిత్ షా వచ్చి బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. అనంతరం 11:30గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి గద్వాలకు వెళ్లి మధ్యాహ్నం 12:40గంటల నుంచి 1:20 వరకు బీజేపీ బహిరంగసభలో పాల్గొంటారని కమలనాథులు చెప్పారు.

నల్గొండలో అమిత్ షా బహిరంగ సభ

అమిత్ షా గద్వాల నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నేరుగా నల్గొండ జిల్లాకు రానున్నారు. నల్గొండలో మధ్యాహ్నం 2:40 గంటల నుంచి మధ్యాహ్నం 3:20 వరకు వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ సభ ముగిశాక అక్కడి నుంచి నేరుగా వరంగల్ కు వస్తారు. సాయంత్రం 4:15 గంటల నుంచి 4:55 వరకు వరంగల్ సభలో ఆయన పాల్గొంటారు.

మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి నేతలతో సమావేశం

సాయంత్రం 5:50గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితితో పాటు అన్ని అనుబంధ విభాగాలతో నిర్వహించే జాతీయ సమావేశానికి ఆయన హాజరవుతారు. సాయంత్రం 6:10 గంటల నుంచి 7:10 గంటల వరకు ఈ సమావేశం సాగనుంది. భేటీ ముగిశాక అక్కడి నుంచి ఆయన నేరుగా అహ్మదాబాద్ కు వెళతారు.