Uttam Kumar Reddy : బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారు
నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారు. మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.

Uttam Kumar Reddy
Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. నేను రైతు బంధు ఆపమని చెప్పినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మా మ్యానిఫెస్టో చదివితే మేం ఏం చేయబోతున్నామో తెలుస్తుందని అన్నారు. రుణమాఫీ ఏకధాటిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతుల ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కు లేదని ఉత్తమ్ అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తోందని, కాంగ్రెస్ ఇచ్చి చూపిస్తుందని ఉత్తమ్ చెప్పారు. క్రాఫ్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్ర తెలంగాణఅని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోయినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సిగ్గుపడాలని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు బైబై కేసీఆర్ అంటున్నారు.. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండు సార్లు రిస్క్ తీసుకున్నారు.. ఇకపై రిస్క్ తీసుకోలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, బీఆర్ఎస్ కంటే మెరుగ్గా కాంగ్రెస్ పాలన ఉంటుందని ఉత్తమ చెప్పారు. తెలంగాణలో రాబోయేది ప్రజాపాలన అని, కాంగ్రెస్ అంటే క్రెడిబిలిటీ అని ఉత్తమ్ చెప్పారు.