రేపు సీఎం జగన్‌తో చిరు సారథ్యంలో సినీ ప్రముఖుల భేటీ

  • Published By: srihari ,Published On : June 8, 2020 / 02:37 PM IST
రేపు సీఎం జగన్‌తో చిరు సారథ్యంలో సినీ ప్రముఖుల భేటీ

Updated On : June 8, 2020 / 2:37 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్లు నిర్మాత సి. కళ్యాణ్ చెప్పారు.

బాలకృష్ణను కూడా ఆహ్వానించినప్పటికీ పుట్టిన రోజు కారణంగా ఆయన రాలేకపోతున్నారని… కల్యాణ్ తెలిపారు. ఈ భేటీకి బాలకృష్ణ కూడా ఆహ్వానం అందింది. కానీ, తాను సమావేశానికి హాజరు కావడం లేదని, తన పుట్టిన రోజు కారణంగానే రావడం లేదని స్పష్టం చేశారు. 

ఈ సమావేశంలో  మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్‌లతోపాటు మొత్తం 25మంది సభ్యుల బృందం హాజరుకానున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవలే సినీ పరిశ్రమకు సంబంధించిన అనుమతులపై సానుకూలంగా స్పందించింది. సినీ పరిశ్రమకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.