TRS MLC Kavitha : 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా
తనపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు.

TRS MLC Kavitha files defamation case against bjp leaders
TRS MLC Kavitha files defamation case against bjp leaders : తనపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు…తనకు ఆ స్కామ్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేసిన కల్వకుంట్ల కవిత తనపై నిరాధారమైన ఇటువంటి ఆలోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఇప్పటికే తెలిపారు కల్వకుంట్ల కవిత. దీంట్లో భాగంగానే ఆమె అన్నట్లుగానే తెలంగాణలో 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువునష్టం దావా దాఖలు చేసారు కవిత. బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మంజుదర్ సిర్సాపై దావా దాఖలు చేశారు కవిత.
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ స్కాంతో తనకు సంబంధం లేకున్నా కూడా తనను..తన తండ్రి సీఎం కేసీఆర్ ను అభాసుపాలు చేసే ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు ఈ ప్రయత్నాలు చేశారని కవిత సోమవారం (ఆగస్టు 22,2022) ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంట్లో భాగంగానే ఆమె ఈ ఇద్దరు నేతలపై పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిర్వహించే దర్యాప్తు సంస్థలకు కూడా తాను సహకరిస్తానని కూడా ఆమె వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా పరువు నష్టం దావాలు వేశారు.
ఢిల్లీలోని మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకు జరిగిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను కవిత తీవ్రంగా ఖండించారు.అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా కవితపై లిక్క స్కామ్ లో పాత్ర ఉందని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన మద్యం మాఫియా ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తేనే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలతో బీజేపీ నేతలు సోమవారం కవిత ఇంటిముందు నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినందుకు నిరసనగా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనదీక్షలకు పిలుపు ఇవ్వటంతో పోలీసులు బండి సంజయ్ ను కూడా అరెస్ట్ చేశారు.
కాగా..ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. అప్ పార్టీని చీలిస్తే బీజేపీ తనకు సీఎం పదవి ఆశ చూపింది అంటూ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే సిసోడియా బీజేపీ బెదిరింపులకు బెదిరేది లేదు..ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సవాల్ విసిరారు.
నన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని..మనీశ్ సిసోడియా అన్నారు. అలాగే నేను రాణా ప్రతాప్ సింగ్ వంశుస్థుడిని తల అయినా నరుక్కుంటాను తప్ప అవినీతిపరులకు తల వంచను అంటూ..వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.