రెండు తలల దూడ జననం.. ఈ వింత చూశారా..!
రెండుతలల దూడను చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.

Two Headed Calf
Two Headed Calf: ఈ సృష్టిలో వింతలకు లోటేలేదు. సాధారణంగా… ఏ ప్రాణికైనా ఒకే తల ఉంటుంది. రెండు తలల ప్రాణి కనిపిస్తే అది వింతే. మనుషుల్లోనూ జన్యులోపాలతో రెండు తలల శిశువులు పుడుతుంటారు. ఐతే… ఎక్కడో ఒక చోట అరుదైన పరిస్థితుల్లో తప్ప.. వీళ్లు ప్రాణాలతో బతికే పరిస్థితి ఉండదు. ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం… జేసీ అగ్రహారం గ్రామంలో ఇలాంటి అరుదైన సంఘటనే బుధవారం(సెప్టెంబర్ 8, 2021) నాడు జరిగింది.
వెంకటేశ్వర్లు అనే రైతు తన రెండు గేదెలతో పాల బిజినెస్ చేస్తున్నాడు. అందులో.. ఓ బర్రె నిన్న ఈనింది. ఐతే.. పుట్టిన దూడ రెండు తలలతో జన్మించింది. రెండు తలలకు అన్ని అవయవాలు ఉన్నాయి. బర్రె ఈనింది… దూడ పుట్టిందన్న ఆనందం ఆయనకు ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన గంటలోపే ఈ రెండు తలల దూడ ప్రాణం విడిచింది.
యానిమల్ హస్బెండరీ డిపార్టుమెంట్ అధికారులు ఈ విషయం తెల్సుకుని చనిపోయిన దూడను పరిశీలించారు. గేదె తీసుకున్న ఆహారం.. జన్యుపరమైన సమస్యలతో.. ఇలాంటివి పుడతాయని చెప్పారు. చనిపోయిన రెండుతలల దూడను చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.