సబ్బు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. అవేంటో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ సబ్బును స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ సబ్బు మనల్నీ శుభ్రంగా ఉంచటంతో పాటు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సబ్బు మన జీవితంలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతందనే విషయం చాలా మందికి తెలియదు. అసలు సబ్బు ఏవిధంగా ఉపయోగపడుతుంది? వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం..
> మీరు ఎక్కువగా జిప్ పాడేపోయిన సమస్యలను ఎదుర్కొంటునట్లయితే… ఆ సమస్యకు సబ్బును ఉపయోగించి ఈజీగా సరి చేయవచ్చు. ఉదాహరణకు మీకు ఎంతో ఇష్టమైన బ్యాగ్, జాకెట్ వంటి వస్తువులు కావచ్చు. వాటి జిప్ సరిగ్గా పనిచేయకపోతే వాటి జిప్ చివర సబ్బు ను రుద్దండి. సెకనులో మీ జిప్ సరి అవుతుంది.
> కొంతమందికి పాదాలకు చెమట ఎక్కువ పడుతుంది. అలాంటి వారి బూట్ల నుంచి దుర్వాసన వస్తుంది. అప్పుడు వారు బూట్ల లోపల సబ్బును ఉంచితే సరిపోతుంది. దానితో అవి వాసన రావు.
> లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేసే వారు ఉన్నారు. ఈ సమయంలో వారు రోజు ఆఫీస్ బట్టలు బీరువాకే అతుకుపోయ్యాయి. వాటిని తాజాగా మంచి వాసనను రావాలన్న ఎక్కువ రోజులు సువాసనగా ఉండాలంటే బట్టలు ఉన్న పేస్లులో సబ్బు బారును ఉంచితే చాలు. అవి ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మంచి సువాసన కూడా వస్తుంది.
> ఏదైనా గ్లాసు, అద్దం కిందపడి చిన్న ముక్కలుగా పగలుతుంది. ఆ చిన్న ముక్కలను వెతుకుంటే మాత్రం, ఆ ప్రాంతంలో తడి సబ్బును ఉపయోగించటంతో మీరు పగిలిన ముక్కలను ఈజీగా గుర్తించవచ్చు. త్వరగా పని పూర్తి అవుతుంది. దీని ద్వారా సమయం ఆదా అవుతుంది. మనల్ని సురక్షితంగా ఉంటాం.
> సమ్మర్ చెమట వల్ల, వర్షాకాలంలో దోమల వల్ల దురద ఎక్కువగా వస్తుంది. ఆ సమయంలో మీరు దురద ఉన్న ప్రాంతంలో సబ్బును వాడటం ద్వారా జాగ్రత్తగా ఉండవచ్చు. దురద ఉన్న ప్రదేశంలో సబ్బును ఉపయోగించటంతో చర్మాన్నికి కొంత ఉపశమనం కలుగుతుంది.
> తలపులుకు ఉంటే స్క్రూ ల మధ్య ఉండే అతుకుల శబ్దం చేస్తుంటే, వాటి పై సబ్బును రుద్దితే అవి శబ్దం చేయటం మానేస్తాయి. అలా మీరు రాత్రి సమయంలో హాయిగా నిద్ర పోవచ్చు.