‘ఆహా’లో అదిరిపోయే సినిమాలు..
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది..

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది..
రోజురోజుకీ ఓటీటీల వినియోగం పెరిగిపోతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వినోదం కోసం ప్రేక్షకులందరూ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఓటీటీ సంస్థలు పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చాలామంది చిన్న నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా ఓటీటీలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులో మొట్టమొదటి ఓటీటీగా మార్కెట్‌లోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు అంతులేని ఆనందాన్ని పంచుతూ(కేవలం రోజుకి రూ.1కే) వెబ్ సిరీస్, సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ సరికొత్త సినిమాలను అందించనుంది. ఇందులో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన ‘లక్ష్మీ’ చిత్రాన్ని జూన్ 19న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధం చేసింది.
అలాగే నవీన్ చంద్ర, సలోని లూథ్రా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ జూలై 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మీనా నటించిన ‘షైలాక్’, తమిళ యంగ్ హీరో జీవా నటించిన ‘జిప్సీ’ చిత్రాలను కూడా త్వరలో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధం చేస్తుంది ‘ఆహా’.