Vaishnav Tej : మెగా మేనల్లుడి మూడో సినిమా ప్రారంభం.. కథానాయికగా కేతికా శర్మ..

‘ఉప్పెన’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మెగాభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ హీరోగా చేసిన రెండో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Vaishnav Tej : మెగా మేనల్లుడి మూడో సినిమా ప్రారంభం.. కథానాయికగా కేతికా శర్మ..

Vaishnav Tej New Movie Launched Under Gireeshaaya Direction

Updated On : April 2, 2021 / 11:50 AM IST

Vaishnav Tej: ‘ఉప్పెన’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మెగాభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ హీరోగా చేసిన రెండో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Vaishnav Tej

తాజాగా మూడో సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. తమిళ్ ‘అర్జున్ రెడ్డి’ (ఆదిత్య వర్మ) దర్శకుడు గిరీశయ్య ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కేతికా శర్మ కథానాయిక.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Vaishnav Tej

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి వైష్ణవ్ తేజ్ సోదరుడు ‘సుప్రీం హీరో’ సాయి ధరమ్ తేజ్ క్లాప్ నివ్వగా, తల్లి విజయ దుర్గ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Vaishnav Tej