Varalaxmi Sarath Kumar: బాలయ్య సినిమాలో జయమ్మను మించి ఊరమాస్..?

టాలీవుడ్‌లో వరుసగా విలక్షణమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్‌గా నటించినా, అక్కడ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కోలీవుడ్ ఆమె పర్ఫార్మెన్స్‌లకు ఫిదా అయ్యింది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Varalaxmi Sarath Kumar: టాలీవుడ్‌లో వరుసగా విలక్షణమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్‌గా నటించినా, అక్కడ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కోలీవుడ్ ఆమె పర్ఫార్మెన్స్‌లకు ఫిదా అయ్యింది. దీంతో అప్పట్నుండీ ఆమె ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, సపోర్టింగ్ పాత్రలు చేస్తూ వస్తోంది. అయితే తెలుగులో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమా అమ్మడికి సూపర్ బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

Varalaxmi Sarath Kumar: SIIMA అవార్డుతో జయమ్మ ఫుల్ హ్యాపీస్!

ఈ సినిమాలో జయమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజను ఢీకొనే పాత్రలో సముథ్రఖని నటించగా, ఆయన పక్కన ఉండే జయమ్మ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు గోపీచంద్. అయితే ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Varalaxmi Sarath Kumar: జయమ్మకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్!

అయితే ఈ సినిమాలోనూ జయమ్మ పాత్రను మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వనుందట ఈ బ్యూటీ. ఈ సినిమాలోనూ అమ్మడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంతటి పవర్‌ఫుల్ పాత్రను ఆమె కోసమే రాసుకున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వరుసగా పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తూ తనలోని నటిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తోన్న వరలక్ష్మీ శరత్ కుమార్, వీరసింహారెడ్డి మూవీలో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు