Varalaxmi Sarath Kumar: SIIMA అవార్డుతో జయమ్మ ఫుల్ హ్యాపీస్!

తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆమె నటించిన క్రాక్, నాంది చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా జరుగుతున్న SIIMA అవార్డులు 2022లో క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది.

Varalaxmi Sarath Kumar: SIIMA అవార్డుతో జయమ్మ ఫుల్ హ్యాపీస్!

Varalaxmi Sarath Kumar Happy On SIIMA Award

Varalaxmi Sarath Kumar: తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆమె నటించిన క్రాక్, నాంది చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా జరుగుతున్న SIIMA అవార్డులు 2022లో క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది.

Varalaxmi Sarath Kumar: జయమ్మకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఈ అవార్డు రావడంపై వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా సంతోషంగా ఉంది. క్రాక్ సినిమాలో తనకు జయమ్మ లాంటి వైవిధ్యమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని, క్రాక్ చిత్ర యూనిట్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది. క్రాక్ తరువాత నాందిలోనూ తన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయని అమ్మడు చెప్పుకొచ్చింది. జయమ్మ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని.. తనకు ఇలాంటి మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉన్నట్లుగా వరలక్ష్మీ చెప్పుకొచ్చింది.

Varalaxmi Saratkumar : వరుస సినిమా ఆఫర్లతో హైదరాబాద్‌కి మకాం మార్చిన తమిళ స్టార్

కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ హను-మాన్, బాలయ్య 107వ చిత్రం, యశోద వంటి చిత్రాల్లో వైవిధ్యమైన రోల్స్‌లో నటిస్తోంది. మరి మున్ముందు ఈ బ్యూటీ చేసే పాత్రలు ఆమెకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయో చూడాలి.