Varalaxmi Sarath Kumar: జయమ్మకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్!

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంతో పాటు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను .....

Varalaxmi Sarath Kumar: జయమ్మకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్!

Varalaxmi Sarath Kumar Tested Corona Positive

Updated On : July 17, 2022 / 3:38 PM IST

Varalaxmi Sarath Kumar: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంతో పాటు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో ఈ బ్యూటీ సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంచి రోల్స్ ఉన్న సినిమాలు చేస్తుండటంతో వరలక్ష్మీ శరత్ కుమార్‌కు ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది.

అయితే తాజాగా ఈ అమ్మడు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. తనకు కరోనా సోకినట్లుగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. కోవిడ్ ముప్పు తొలిగిపోయిందని అందరూ మాస్క్‌లు ధరించడం మానేశారని.. తాను కూడా అలా అనుకుందని.. కానీ ఇంకా కరోనా మహమ్మారి జనం మధ్యలో తిరుగుతుందని, అందుకే అందరూ తప్పకుండా మాస్క్ ధరించాలని ఆమె కోరింది.

ఇక రీసెంట్‌గా తనను కలుసుకున్న వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవడం మంచిదని అని ఆమె చెప్పుకొచ్చింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కరోనా సోకిందనే వార్తతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆమె అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.