Venu Tottempudi : మరో సూపర్ ఛాన్స్ కొట్టేసిన వేణు తొట్టెంపూడి.. 22 ఏళ్ళ తర్వాత ఆ డైరెక్టర్ తో??

తాజాగా వేణుకి మరో పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా..........

Venu Tottempudi : మరో సూపర్ ఛాన్స్ కొట్టేసిన వేణు తొట్టెంపూడి.. 22 ఏళ్ళ తర్వాత ఆ డైరెక్టర్ తో??

Venu Tottempudi got a chance in Trivikram Movie

Updated On : August 8, 2022 / 12:42 PM IST

Venu Tottempudi :  స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు ఆ తర్వాత చాలా సినిమాలతో హిట్స్ కొట్టి మెప్పించాడు. కానీ సడెన్ గా సినిమాలు వదిలేసి బిజినెస్ లో సెటిల్ అయిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవలే రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో మంచి పాత్రలు వస్తే ఇక ముందు కూడా నటిస్తాను అని చెప్పాడు వేణు.

తాజాగా వేణుకి మరో పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వేణుని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ వేణుని కలిసి కథ కూడా చెప్పాడని తెలుస్తుంది. మరి వేణు ఇందుకు ఒప్పుకుంటాడా? త్రివిక్రమ్ మహేష్ సినిమాలో నటిస్తాడా తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.

Thaman Mother Singing : 70 ఏళ్ళ వయసులో మసక మసక చీకట్లో పాడుతున్న తమన్ తల్లి సావిత్రి..

వేణు చేసిన కొన్ని సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. 22 ఏళ్ళ క్రితం వేణు నటించిన చిరునవ్వుతో సినిమాకి త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. మళ్ళీ 22 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా కావడం, త్రివిక్రమ్ మహేష్ మూడో సారి జత కట్టడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.