Actor Chandra Shekhar : సీనియర్ నటుడు చంద్ర శేఖర్ మృతి..
‘రామాయణ్’ ధారావాహికతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన వెర్సటైల్ బాలీవుడ్ యాక్టర్ చంద్ర శేఖర్ వైద్య (98) మరణించారు..

Veteran Actor Chandra Shekhar Passed Away
Actor Chandra Shekhar: వెర్సటైల్ బాలీవుడ్ యాక్టర్ చంద్ర శేఖర్ వైద్య (98) మరణించారు. ‘రామాయణ్’ ధారావాహికతో నటుడిగా మంచి గుర్తింపు పొందారాయన. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా పని చేశారు చంద్ర శేఖర్.
వయోభారంతో స్వగృహంలోనే బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. చంద్రశేఖర్ మరణవార్త తెలుసుకున్న హిందీతో పాటు, భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
‘బేబాస్’, ‘కవి’, ‘మస్తానా’, ‘కాలీ’, ‘బసంత్ బహార్’, ‘ కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ వే ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్’ (1957), ‘ధర్మ’, ‘డిస్కో డ్యాన్సర్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చంద్రశేఖర్.