Vijay Deverakonda – Rashmika Mandanna : రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో చూశారా!..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్యూట్ స్టార్ రష్మిక మందన్న.. ‘గీతగోవిందం’ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ నటించారు.. అప్పటినుండి వీళ్లు మరోసారి కలిసి నటిస్తారనే వార్తలు వచ్చాయి కానీ ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు..

Vijay Deverakonda – Rashmika Mandanna : రష్మికకు ప్రపోజ్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో చూశారా!..

Vijay Deverakonda – Rashmika Mandanna

Updated On : April 20, 2021 / 6:30 PM IST

Vijay Deverakonda – Rashmika Mandanna: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్యూట్ స్టార్ రష్మిక మందన్నకు ప్రపోజ్ చేశాడు.. కాకపోతే అది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో.. అదికూడా సినిమా కాదండోయ్.. విజయ్, రష్మిక.. ఫస్ట్ టైమ్ ‘గీత గోవిందం’ సినిమాలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ నటించారు.. అప్పటినుండి వీళ్లు మరోసారి కలిసి నటిస్తారనే వార్తలు వచ్చాయి కానీ ఏ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు.

Vijay Deverakonda - Rashmika Mandanna

కట్ చేస్తే, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయ్ – రష్మిక కలిసి నటిస్తున్నారు.. విజయ్ అప్‌కమింగ్ మూవీ ‘లైగర్’ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కదా హీరోయిన్ మరి రష్మిక ఏంటి?.. ఇంకో కొత్త సినిమానా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. వీళ్లు కలిసి యాక్ట్ చేస్తున్నారు కానీ అది సినిమా కాదు..

Vijay Deverakonda - Rashmika Mandanna

విజయ్ – రష్మిక, పాపులర్ సంతూర్ సోప్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నారు.. ఇందులో భాగంగా ఓ యాడ్ షూటింగ్‌లో కలిసి నటించారు. షూటింగ్ తాలుకు చిన్న బిట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో విజయ్, రష్మికకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు.. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌లో విజయ్, రష్మిక పెయిర్ బాగుంది.. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి..