Vishwak Sen : ఇక చెప్పడం ఉండదు.. ‘ధమ్కీ’ ఇవ్వడమే అంటున్న విశ్వక్ సేన్..
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇక చెప్పడం ఉండదు, ధమ్కీ ఇవ్వడమే ఉంటది అంటున్నాడు. విశ్వక్ ఇటీవల తమిళ సినిమా 'ఓ మై కడవులే' కు రీమేక్ గా 'ఓరి దేవుడా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చి మంచి విజయానే అందుకున్నాడు. తాజాగా...

Vishwak Sen new movie Dhamki first look poster
Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇక చెప్పడం ఉండదు, ధమ్కీ ఇవ్వడమే ఉంటది అంటున్నాడు. విశ్వక్ ఇటీవల తమిళ సినిమా ‘ఓ మై కడవులే’ కు రీమేక్ గా ‘ఓరి దేవుడా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చి మంచి విజయానే అందుకున్నాడు. తాజాగా మరో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఎటువంటి ప్రకటన లేకుండా విడుదల చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు.
Vishwak Vs Arjun : విశ్వక్సేన్, అర్జున్ మధ్య సినిమా వివాదం
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ధమ్కీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా పోస్టర్ ని విశ్వక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “నో అలెర్ట్ ఓన్లీ ధమ్కీ” అంటూ కాప్షన్ ఇచ్చాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.
కాగా ఇటీవల విశ్వక్ సీనియర్ హీరో మరియు దర్శకుడు అర్జున సర్జా మధ్య వివాదం రాచుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఒక చిత్రానికి సైన్ చేసిన విశ్వక్.. ప్రొడక్షన్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చి, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తెలుగు సినిమా కౌన్సిల్ లో విశ్వక్ పై పిర్యాదు చేశాడు. ఈ విషయం పట్ల విశ్వక్ ని పలువురు ఇండస్ట్రీ పెద్దలు కూడా హెచ్చరించారు.
View this post on Instagram