Vishwak Sen: విశ్వక్ సేన్ కొత్త సినిమా‘అశోకవనంలో అర్జున కళ్యాణం’..

‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది..

Vishwak Sen: విశ్వక్ సేన్ కొత్త సినిమా‘అశోకవనంలో అర్జున కళ్యాణం’..

Vishwak Sen

Updated On : April 16, 2021 / 5:54 PM IST

Vishwak Sen: ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Vishwak Sen

శుక్రవారం మరో కొత్త సినిమా ప్రకటించాడీ యంగ్ హీరో. విశ్వక్ సేన్ నటిస్తున్న 7వ చిత్రమిది. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు.

Vishwak Sen

విద్యా సాగర్ చింతా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటిఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌తో సహా మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు నిర్మాతలు.. ఈ చిత్రానికి కథ : రవి కిరణ్ కోలా, సంగీతం : జయ్ కృష్ణ, ఎడిటింగ్ : విప్లవ్.

Ashoka Vanamlo Arjuna Kalyanam