Cyclist Raging Bull : సైకిల్ రైడర్లను గాల్లోకి ఎగరేసి దాడి చేసిన ఎద్దు.. వీడియో వైరల్!

అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొన్న సైకిల్ రైడర్లపై ఓ ఎద్దు దాడికి దిగింది. ఫిబ్రవరి 12న జరిగిన సైకిల్ రేస్‌లో ఎద్దు దాడి చేసి వారిని గాల్లోకి ఎత్తిపడేసింది.

Cyclist Raging Bull : సైకిల్ రైడర్లను గాల్లోకి ఎగరేసి దాడి చేసిన ఎద్దు.. వీడియో వైరల్!

Watch Cyclist Tossed In The Air By Raging Bull During Race (1)

Updated On : February 22, 2022 / 10:59 PM IST

Cyclist Raging Bull Viral Video : అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొన్న సైకిల్ రైడర్లపై ఓ ఎద్దు దాడికి దిగింది. ఫిబ్రవరి 12న జరిగిన సైకిల్ రేస్‌లో ఎద్దు దాడి చేసి వారిని గాల్లోకి ఎత్తిపడేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ముగ్గురు సైక్లిస్టులలో ఎవరికి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ న్యూస్ ప్రసారం చేసింది. ఎద్దు దాడిచేసిన వారిలో ముగ్గురు సైక్లిస్టులలో ఒకరు టోనీ ఇండెర్బిట్జిన్‌గా గుర్తించారు. ఆ వీడియోలో అతన్ని ఎద్దు గాలిలో అమాంతం పైకి ఎగరవేయడం కనిపిస్తోంది.

బేకర్స్‌ఫీల్డ్ ప్రాంతంలోని 80-మైళ్ల సైకిల్ కోర్సు బియాంచి రాక్ కాబ్లర్‌లో ఈ ఘటన జరిగింది. రేసుకు ముందు.. ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమికి చాలా దూరంగా తీసుకెళ్లాడు. కానీ, అది మళ్లీ అది అక్కడికి వచ్చి రైడర్లపై దాడి చేసిందని సైక్లింగ్ పాల్గొన్న ఒకరిలో రిచర్డ్ పెప్పర్ చెప్పారు.

సైకిల్ రైడర్లపై దాడి చేసిన అనంతరం ఆ ఎద్దు అక్కడి నుంచి పరిగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. రాక్ కాబ్లర్ క్రియేటర్ సామ్ అమెస్, Instagramలో దాడి ఘటనపై స్పందించారు. ముగ్గురు వ్యక్తులు ఆ ఎద్దుతో పోటీపడ్డారని తెలిపారు. ఏదిఏమైనా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sam Ames (@therockcobbler)


Read Also :  Tata Nano: హెలికాప్టర్‌గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్