Tata Nano: హెలికాప్టర్‌గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్

పెళ్లి ఊరేగింపుల్లో టాప్ లేని కారుల్లో వధూవరులు ఊరేగింపుగా మండపానికి వస్తుంటే ఆ సెలబ్రేషనే వేరు. పెళ్లి వేడుకలో సెలబ్రిటీల రేంజ్‌లో ఫీల్ అయ్యేందుకు, ఊరేగింపులో...

Tata Nano: హెలికాప్టర్‌గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్

Nano To Helicopter

Tata Nano: పెళ్లి ఊరేగింపుల్లో టాప్ లేని కారుల్లో వధూవరులు ఊరేగింపుగా మండపానికి వస్తుంటే ఆ సెలబ్రేషనే వేరు. పెళ్లి వేడుకలో సెలబ్రిటీల రేంజ్‌లో ఫీల్ అయ్యేందుకు, ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేది వాళ్లు ప్రయాణించే వాహనమే. అలాంటి వేడుకల కోసమే బీహార్ లోని గుడ్డు శర్మ అనే వ్యక్తి క్రియేటివిటీని వాడి టాటా నానో కారును హెలికాప్టర్ గా మార్చేశాడు.

ఈ హెలికాప్టర్ ఎగరలేదు కానీ, హెలికాప్టర్ ఎక్కాలనుకునే వారి కోరిక తీరుస్తుంది. ఆరంభంలో సాధారణ ఈవెంట్లకు అద్దెకు ఇచ్చిన గుడ్డు శర్మ.. పెళ్లి వేడుకలకు డిమాండ్ ఎక్కువ కనిపిస్తుండటంతో నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కేవలం పెళ్లి సెలబ్రేషన్స్ కోసమే అద్దెకు ఇస్తూ కోరికలు తీరుస్తున్నాడు.

సైజులో చిన్నగా కనిపించే నానో బాడీని హెలికాప్టర్‌కు కరెక్ట్ గా సరిపోయిందంటున్నాడు గుడ్డూ. దీని కోసం రూ.1.5లక్షలు కేటాయించాడు. ఫినిషింగ్ చేసేంతవరకూ మొత్తం రూ.2లక్షలు ఖర్చు అయిందని చెప్తున్నాడు.

Read Also: నానో ఇన్‌స్పిరేషన్‌తో బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ధర తక్కువే!

తన ప్రయోగం గురించి చెప్తూ.. ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియాకు ఇది ఉదాహరణ అని వివరించాడు.

ఆ ప్రాంతంలో గుడ్డు హెలికాప్టర్ కు విపరీతమైన డిమాండ్ వస్తుంది. హెలికాప్టర్ ఎక్కాలనుకునేవారు.. పైలట్ కావాలనుకునేవారు తమ కలను ఇలా తీర్చుకుంటున్నారు.