వైరల్‌గా మారిన జీవా.. ఎంఎస్ ధోనీల లేటెస్ట్ పిక్

వైరల్‌గా మారిన జీవా.. ఎంఎస్ ధోనీల లేటెస్ట్ పిక్

Updated On : January 8, 2021 / 4:17 PM IST

Ziva Dhoni: చాలా రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో మెరిశారు జీవా ధోనీ. తండ్రీ బిడ్డ కలిసి దిగిన పోస్టును ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. జీవా ధోనీ అధికారిక అకౌంట్లో పోస్టు చేసిన ఫొటోకు ఆన్ లైన్ లో హార్ట్ సింబల్స్ వర్షంలా కురుస్తున్నాయి. ఐదేళ్ల వయస్సు మాత్రమే ఉన్నా జీవాధోనీకి అమితమైన అభిమానులు ఉన్నారు. ధోనీ కూతురంటే మామూలు క్రేజ్ కాదు మరి. ఈమెకు ఇన్‌స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

ధోనీ వీపు మీద ఎక్కి ఆడుకుంటున్న ఫొటోను చూస్తుంటే తండ్రీ-కూతురు హ్యాపీమోడ్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫొటోకు వచ్చిన లైకులు దాదాపు 4లక్షలకు చేరిపోయాయి. కామెంట్లు కూడా వచ్చేవి కాకపోతే వాటిని డిజేబుల్ చేయడంతో ఒక్క కామెంట్ కూడా రాలేదు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫ్యామస్ ఫాదర్ అని నిరూపించుకున్న ధోనీ.. చాలాసార్లు స్టేడియంలో కూతురితో కలిసి కనిపించాడు. స్టేడియంకు కూతురితో సహా రావడంతో తనకు కూడా క్రేజ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియా అకౌంట్లలోనూ తల్లి, తండ్రి లేకుండా ఒక్క పోస్టు కూడా ఉండదు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఈ చిన్నారి ప్రతి పోస్టు వైరల్ మారడం ఖాయం. వయస్సు కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ కిడ్స్ లో జీవా ధోనీ టాప్ అనేయొచ్చు.