heart health with exercise : వ్యాయామాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

వ్యాయామం పేరుతో జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. ఇంటివద్దనే ఉండి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేసినా సరిపోతుంది.

heart health with exercise : వ్యాయామాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

Diet and Exercise for a Healthy Heart

Updated On : November 4, 2022 / 9:25 PM IST

heart health with exercise : గుండె ఆరోగ్యానికి వ్యాయామాలతో ఎంతో మేలు కలుగుతుంది. సులువైన వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర వ్యాయామం కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం అంటే రోజూ జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజులో కొంత సమయం నడవడం, యోగా, చిన్న పాటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. గుండెకు మేలు చేసే వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి. రోజులో 15 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల పూర్తి ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయావాల్లో గుండె ఒకటి. గుండె తన క్రమాన్ని నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా, తక్కువగా కొట్టుకున్న ఇబ్బందుల్లో ఉన్నట్లే. ప్రతిరోజూ వ్యాయామాలు చేయకపోవడం బద్దకంగా నిద్రపోవడం లాంటివి చేసేవారిలో గుండె సమస్యలు తలెత్తుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం పేరుతో జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. ఇంటివద్దనే ఉండి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేసినా సరిపోతుంది. వారం మొత్తం ఇష్టమైన ఆహారాన్ని లాగించి వారంలో ఒకరోజు వ్యాయామానికి కేటాయించటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏరోజు తిన్న ఆహారానికి సంబంధించిన కేలరీలు ఆరోజు ఖర్చు చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడమే ఉత్తమం.