Teaతో ఇమ్యూనిటీ పెంచుకోండిలా.. ఆయుర్వేద టెక్నిక్‌లు

Teaతో ఇమ్యూనిటీ పెంచుకోండిలా..  ఆయుర్వేద టెక్నిక్‌లు

Updated On : July 22, 2020 / 4:27 PM IST

SARS-COV2వైరస్‌తో పోరాడేందుకు సైంటిస్టులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదురోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదై ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ సమయంలో ఇమ్యూనిటీ పెంచుకుని కరోనావైరస్ నుంచి శరీరాన్ని కాపాడుకోవడమే మన కర్తవ్యం. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడి వైరస్ ను తట్టుకునే శక్తి సంపాదించుకోవడం బెటర్.

ఆయుర్వేదిక్ పద్ధతిలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఉన్న ఐదు పద్ధతులు మీకోసం:
అల్లం టీ: అల్లం టీ అనేది చాలా త్వరగా తయారుచేయగలిగేది. జలుబు, దగ్గు నుంచే కాక కడుపులో నొప్పి వంటి సమస్యలకు రిలీఫ్ ఇస్తుంది.
ఎలా తయారుచేయాలో తెలుసా:
అర టీ స్పూన్ అల్లం గుజ్జు తీసుకోవాలి. గ్లాస్ నీళ్లలో ఐదారు నిమిషాలు మరిగించాలి. కాసేపు చల్లార్చి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి.
గమనిక: హైపర్ఎసిడిటీ, హైపర్ టెన్షన్ ఉన్న వారు ఇది తీసుకునే ముందు ఓ సారి డాక్టర్ ను సంప్రదించాలి.

దాల్చిన చెక్కతో టీ: దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే బరువు కూడా తగ్గుతాం. గుండెనొప్పుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడంతో పాటు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
ఎలా తయారుచేయాలో తెలుసా:
అరంగుళం దాల్చిన చెక్క తీసుకుని గ్లాస్ నీళ్లలో మరిగించండి. కాస్త చల్లార్చుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేయండి.

తులసీ టీ:
తులసి ఆకులకు చాలా మెడిసినల్ ధర్మాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పెంచడానికి, ఒత్తిడి నుంచి బయటపడేయడానికి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి.
ఎలా తయారుచేయాలో తెలుసా:
నాలుగైదు తులసి ఆకులు వేసి గ్లాస్ నీళ్లలో 10 నిమిషాలు మరిగించాలి. ఇలా చేసే సమయంలో మూత పెట్టే ఉంచాలనే విషయం మర్చిపోకూడదు.

జీలకర్ర టీ:
జీలకర్ర టీ అరుగుదల శక్తిని పెంచడంతో పాటు అధిక బరువును సమతుల్యం చేస్తుంది. దీనిని తయారుచేయడానికి జీలకర్ర, ధనియాల గింజలు, మెంతులు కావాలి.
ఎలా తయారుచేయాలో తెలుసా:
అర టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అర టీ స్పూన్ ధనియాల గింజలు, పావు టీ స్పూన్ మెంతులు వేసి కప్ నీళ్లలో ఐదారు నిమిషాలు మరిగించాలి. కాసేపు చల్లార్చి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి.

తులసీ, నల్ల మిరియాల టీ:
ఈ టీ గ్రేట్ ఇమ్యూనిటీ బూస్టర్. సీజనల్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది తయారుచేయడానికి తులసి ఆకులతో పాటు, నల్ల మిరియాలు, లవంగాలు తీసుకోవాలి.
ఎలా తయారుచేయాలో తెలుసా:
మూణ్నాలుగు తులసి ఆకులు తీసుకోవాలి. రెండు మిరియాల గింజలు, ఒక లవంగం రెండు గ్లాసుల నీళ్లలో వేసి మరిగించాలి.
గమనిక: గర్భిణీలు ఇది తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించాలి.