Covid New Drug : కరోనా చికిత్సకు కొత్త మందు.. ఐదు రోజులిస్తే చాలు.. వైరస్ ఖతమే!

కరోనా చికిత్సకు కొత్త మందు కనుగొన్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. ఈ మందును ఐదురోజుల పాటు ఇంజెక్షన్ రూపంలో ఇస్తే చాలు.. వైరస్ కణాలు వెంటనే చచ్చిపోతాయని అంటున్నారు.

Covid New Drug : కరోనా చికిత్సకు కొత్త మందు.. ఐదు రోజులిస్తే చాలు.. వైరస్ ఖతమే!

New Drug Effective Covid 19 Treatment

Updated On : May 20, 2021 / 2:17 PM IST

New Drug effective COVID-19 treatment : కరోనా చికిత్సకు కొత్త మందు కనుగొన్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. ఈ మందును ఐదురోజుల పాటు ఇంజెక్షన్ రూపంలో ఇస్తే చాలు.. వైరస్ కణాలు వెంటనే చచ్చిపోతాయని అంటున్నారు. ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త మందును కనుగొంది.గ్రిఫిత్‌ యూనివర్సీటీకి చెందిన మెంజీస్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ నేతృత్వంలో ఈ కొత్త ఔషధాన్నిఅభివృద్ధి చేశారు. పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలపై ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. జీవ కణాల్లోకి ప్రవేశించిన వైరస్‌ అభివృద్ధి చెందకుండా ఈ కొత్త ఔషధం అడ్డుకుంటుంది.

ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. కరోనా వైరస్‌ పార్టికల్స్‌ 99.9శాతం క్షీణించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ఇదే ఫలితం వచ్చే అవకాశముందని అంటున్నారు. కరోనా బాధితులకు 5 రోజులపాటు ప్రతిరోజు ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడం ద్వారా కొవిడ్‌ను కంట్రోల్ చేయొచ్చునని అంటున్నారు. మనుషులపై ట్రయల్స్ పూర్తికావడానికి సమయం పడుతుందని పరిశోధక వర్గాలు వెల్లడించాయి.


కరోనాలో ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ రహస్యాలను ఈ పార్టికల్స్‌ మనిషిలోని జీవకణాలకు చేరవేస్తాయి. అన్ని కణాలను వైరస్‌గా మార్చేందుకు సహకరిస్తుంటాయి. ఈ కొత్త ఔషధం వైరస్ అభివృద్ధిచెందకుండా అడ్డుకుంటుంది. వైరస్ కణాలపై దాడిచేసి ఆర్‌ఎన్‌ఏ సమాచారాన్ని మారకుండా అడ్డుకుంటుంది. దాంతో వైరస్‌ కాపీలు పెరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు. కరోనా జాతుల్లో అన్ని వైరస్‌లపై ఈ దివ్యాషధం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.