Biryani: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో దుమ్మురేపిన బిర్యానీ.. ఈ ఏడాదిలో ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్లతో దమ్ బిర్యానీ ఇందులో ఛాంపియన్‌గా నిలిచింది. దీని తర్వాత 7.9 లక్షల ఆర్డర్లతో బిర్యానీ రైస్, 5.2 లక్షల ఆర్డర్లతో మినీ బిర్యానీ ఉన్నాయి.

Online Food Delivery: భారతదేశం దాని సాంస్కృతిక వారసత్వానికి మాత్రమే కాకుండా ఆహారం విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లభించే వివిధ రకాల ఆహారాలు బయటున్న ప్రజలకు నిద్రలేని రాత్రులను ఇస్తాయంటే అతిశయోక్తి కాదు. కొందరి అభిరుచి ఏంటంటే.. విదేశాల నుంచి ఇక్కడికి విహార యాత్రలకు వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైన ఆహారాన్ని గుర్తుంచుకుని మరీ రుచి చూస్తారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బిర్యానీ. హైదరాబాదీలు ప్రతి రోజు బిర్యానీ తింటారు, కానీ అలసిపోరు. బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అంత క్రేజ్ ఉంది.
ఇక ఇది ఈ-కామర్స్ లో కూడా టాప్ లో ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఒక్క స్విగ్గీలోనే 72 లక్షల బిర్యానీ ఆర్డర్‌లు వచ్చాయట. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.39 శాతం పెరిగింది. గత 12 ఏళ్లలో మొత్తం బిర్యానీ ఆర్డర్లు 1.50 కోట్లు. వేరే ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్‌ఫారమ్‌లు సహా రెస్టారెంట్‌ల నుంచి నేరుగా జరిగిన విక్రయాలను కలిపితే ఈ సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాగా, ఈ బిర్యానీల్లో కూడా కొన్ని బిర్యానీలు ప్రత్యేకంగా అమ్ముడుపోయి.
ఇది కూడా చదవండి: United Nations: ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేని ఐక్యరాజ్యసమితి.. తీవ్ర విమర్శలు.. 70 ఏళ్ల చరిత్ర తెలుసుకోండి
తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్లతో దమ్ బిర్యానీ ఇందులో ఛాంపియన్‌గా నిలిచింది. దీని తర్వాత 7.9 లక్షల ఆర్డర్లతో బిర్యానీ రైస్, 5.2 లక్షల ఆర్డర్లతో మినీ బిర్యానీ ఉన్నాయి. బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని డేటా వెల్లడించింది. ఈ నగరం ఒక్క జూన్‌లోనే 7.2 మిలియన్ల బిర్యానీలను ఆర్డర్ చేసింది. 5 మిలియన్ల ఆర్డర్‌లతో బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, 3 మిలియన్ల ఆర్డర్‌లతో చెన్నై మూడో స్థానంలో నిలిచింది.
బిర్యానీ ఆర్డర్లు పెరగడం భారతీయ ఆహార పరిశ్రమకు సానుకూల సంకేతం. భారతీయులు ఈ రుచికరమైన రైస్ డిష్‌కు తమ డిమాండ్‌ను వేగంగా పెంచుకుంటున్నారని, దానిని ఆస్వాదిస్తున్నారని డేటా చూపిస్తుంది. స్విగ్గీ నివేదిక ప్రకారం.. బెంగళూరులో భారతదేశంలో అత్యధిక బిర్యానీ రెస్టారెంట్లు ఉన్నాయి. దాదాపు 24,000 రెస్టారెంట్లు బిర్యానీని అందిస్తున్నాయి. ఇక 22,000 బిర్యానీ రెస్టారెంట్లతో ముంబై రెండవ స్థానంలో ఉంది, 20,000 బిర్యానీ రెస్టారెంట్లతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.