Brown Rice : బరువును తగ్గించే బ్రౌన్ రైస్!
వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం మంచిది. బ్రౌన్ రైస్ తినడం వల్ల పొట్ట కొవ్వు త్వరగా తగ్గుతుంది. ప్రేగులలో కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

Brown Rice (2)
Brown Rice : తెల్లఅన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువ. బ్రౌన్ రైస్ లో గామా అమైనోబ్యుటిరిక్ యాసిడ్ అని పిలిచే అమైనో యాసిడ్ ఉంటుంది. శరీరంలో చేరిన ఈ యాసిడ్లు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గేలా చేస్తాయి. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ ను తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు. స్లిమ్‌గా, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలనే కోరుకునే వారు బ్రౌన్ రైస్ తినటం మంచిది.
బరువు తగ్గాలనుకునేవారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్ తినటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. బ్రౌన్ రైస్ తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం అరవై శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. గుండె ఆరోగ్యానికి కూడా బ్రౌన్ రైస్ మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ బి1, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. గుండె పోటు సమస్యలు రాకుండా తోడ్పడుతుంది. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిని అడ్డుకోవటంలో బ్రౌన్ రైస్ ఉపకరిస్తుంది.
వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం మంచిది. బ్రౌన్ రైస్ తినడం వల్ల పొట్ట కొవ్వు త్వరగా తగ్గుతుంది. ప్రేగులలో కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది. బ్రౌన్ రైస్ తినే వారు బరువు త్వరగా తగ్గాలంటే ప్రతిరోజు అరగంట పాటు వేగంగా నడవటం, జాగింగ్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బ్రౌన్ రైస్, వ్యాయామం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. బ్రౌన్ రైస్ లో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తాయి.
ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన మెగ్నీషియం బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా ఉంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న బ్రౌన్ రైస్ షుగర్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ అల్జీమర్స్ వ్యాధిని నివారించటంలో, మహిళల్లో ఒత్తిడిని తగ్గించటంలో బ్రౌన్ రైస్ సహాయకారిగా పనిచేస్తుంది. మానసిక అనారోగ్యం, నిరాశ, అలసటను తగ్గించి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది.