Mango Fruits : మామిడి పండ్లు తినటం వల్ల…. ఆరోగ్యానికి అనుకూల ఫలితాలు

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ వంటకాల్లో మామిడి పండ్లను విరివిగా తీసుకుంటున్నారు. ఈ కొత్త పరిశోధన మామిడిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

Mango Fruits : మామిడి పండ్లు తినటం వల్ల…. ఆరోగ్యానికి అనుకూల ఫలితాలు

Mango

Updated On : March 6, 2022 / 1:07 PM IST

Mango Fruits : మామిడి పండు తినటం వల్ల దీర్ఘకాలిక వ్యాధికి కారణమయ్యే ప్రమాదకాలను నియంత్రించటంలో సహాయపడుతుందని కొత్త పరిశోధన అధ్యయనాల్లో కనుగొన్నారు. మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత దూరంగా ఉండమని సూచించే పండ్లలో మామిడికాయ కూడా ఒకటి. తక్కువ మోతాదులో పండ్లు , కూరగాయల తీసుకోవటం అన్నది మధుమేహం, గుండె జబ్బులు వంటి ఆహార సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. ఇటీవలి నిర్వహించిన రెండు కొత్త పరిశోధన అధ్యయనాలు సాధారణ మామిడి వినియోగం వల్ల ఆరోగ్యానికి మేలు కలగటంతోపాటుగా, దీర్ఘకాలిక వ్యాధికి దోహదపడే కీలక ప్రమాద కారకాలను నియంత్రించటంలో సహాయపడుతుందని కనుగొన్నాయి.

ఈ అధ్యయనాలకు సంబంధించిన వివరాలను న్యూట్రియెంట్స్ , మరియు న్యూట్రిషన్, మెటబాలిజం & కార్డియోవాస్కులర్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. ప్రత్యేకించి, ఈ కొత్త అధ్యయనాలు ద్వారా అనేక ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి. మామిడికాయలను ఆహారంగా తీసుకోవటం వల్ల పిల్లలు, పెద్దలలో పోషకాల స్ధాయి మెరుగైనట్లు గుర్తించారు. అంతేకాకుండా మామిడికాయలను అల్పాహారంగా తీసుకోవటం వల్ల గ్లూకోజ్ స్ధాయిలు మెరుగుపడ్డాయి. వాపులను తగ్గించటంలో ఇవి ఎంతగానో ఉపకరించినట్లు కనుగొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ వంటకాల్లో మామిడి పండ్లను విరివిగా తీసుకుంటున్నారు. ఈ కొత్త పరిశోధన మామిడిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తేలింది. పరిశీలనా అధ్యయనంలో మామిడి పండ్లను తినే వ్యక్తులలో పోషకాలు,బరువు, ఆరోగ్యంతో మామిడిపండ్లు తినని వ్యక్తులతో సరిపోల్చి చూశారు. మామిడిపండును క్రమం తప్పకుండా తినే పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు A, C మరియు B6, అలాగే ఫైబర్,పొటాషియం ఎక్కువగా ఉంటాయని అధ్యయనంలో తేలింది.

పెద్దవారిలో, పరిశోధకులు ఇలాంటి ఫలితాలను కనుగొన్నారు, మామిడిపండు తినటంవల్ల ఫైబర్, పొటాషియంతో పాటు విటమిన్లు A, B12, C, E ,ఫోలేట్, గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధిలో కీలకమైన విటమిన్లు అందుతాయి. పిల్లలు,పెద్దలు ఇద్దరికీ మామిడిపండు తినడం వల్ల సోడియం, చక్కెర తగ్గించటంలో దోహదపడటంతోపాటు , పెద్దలలో కొలెస్ట్రాల్ తగ్గింపుతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది.