Lose Weight : ఒక టీస్పూన్ జీలకర్రతో ఈజీగా బరువు తగ్గొచ్చా?

జీలకర్ర బరువును తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. జీవక్రియ రేటుతోపాటు, జీర్ణక్రియను పెంచడం ద్వారా కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతుంది.

Lose Weight : ఒక టీస్పూన్ జీలకర్రతో ఈజీగా బరువు తగ్గొచ్చా?

Lose Weight

Updated On : April 26, 2022 / 6:29 AM IST

Lose Weight : భారతీయులు ఆహారంలో విరివిగా ఉపయోగించే మసాల దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. ప్రతి ఇంటి పోపుల పెట్టెలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. చేదు , మట్టి వాసనతో కూడి ఉండే జీలకర్రకు బరువును తగ్గించే శక్తి కూడా ఉందని చాలా మందికి తెలియదు. జీలకర్రను క్రమం తప్పకుండా తినడం ద్వారా కేవలం 20 రోజుల్లో బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించుకోవచ్చు. రోజూ జీలకర్ర తింటే మొత్తం శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

అనేక అధ్యయనాల్లో సైతం ఇదే విషయం స్పష్టమైంది. జీలకర్ర బరువును తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. జీవక్రియ రేటుతోపాటు, జీర్ణక్రియను పెంచడం ద్వారా కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అలాగే అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంతోపాటు గుండెపోటును నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెపొందేందుకు దోహదపడుతుంది. రక్తహీనతను తొలగించి పొట్టలో ఉండే గ్యాస్, ఉబ్బరం వంటి వాటిని తొలగిస్తుంది.

2 టేబుల్ స్పూన్ల జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టు కోవాలి. ఉదయం పొయ్యిపై ఉంచి మరిగించుకోవాలి. తరువాత కషాయాన్ని వడకట్టుకుని అందులో ఒక నిమ్మకాయను పిండుకొని సేవించాలి. ఇలా చేయటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. రెండు వారాల పాటు ఖాళీ కడుపుతో ఉదయాన్నే దీన్ని తీసుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. బొడ్డు చుట్టూ ఉండే కొవ్వులు కరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు సులభంగా తగ్గవచ్చు.