Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

మామిడి పళ్లు, సీతాఫలాలు, సపోటా లాంటి పళ్లు డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు మంచిది కాదు. కానీ ఈ మామిడి, అరటి, కీరాదోస, ఆకుకూరల వల్ల బరువు పెరుగుతారనే నమ్మకం కొందరిలో ఉంది. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.

Eating Fruits : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు డాక్టర్లు, పోషకాహార నిపుణులు. కానీ పండ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని నమ్ముతుంటారు కొందరు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

READ ALSO : Holiday weight gain : పండగల్లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు షుగర్స్ ఎక్కువగా ఉండే కొన్ని రకాల పళ్లు తినకూడదని చెబుతారు డాక్టర్లు. కానీ డయాబెటిస్ లేనివాళ్లు కూడా పళ్లుతినొద్దన్న నమ్మకాలతో భయపడేవాళ్లు కూడా ఉన్నారు. మామిడి పళ్లు, సీతాఫలాలు, సపోటా లాంటి పళ్లు డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు మంచిది కాదు. కానీ ఈ మామిడి, అరటి, కీరాదోస, ఆకుకూరల వల్ల బరువు పెరుగుతారనే నమ్మకం కొందరిలో ఉంది. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.

READ ALSO : Bad For Your Heart : గుండెకు హాని కలిగించే ఆహారాలు ఇవే !

పళ్లు పోషకాలకు పవర్ హౌజ్ లాంటివి. 200 నుంచి 250 గ్రాముల మామిడి పండు తింటే 150 నుంచి 175 కేలరీలు వస్తాయి. కానీ ఒక చిన్న కేకు ముక్క నుంచి ఇంత కన్నా ఎక్కువ కేలరీలు వస్తాయి. దీని నుంచి 350 కేలరీలు వస్తాయి. ఒక ప్లేట్ పానీపూరీ నుంచి 400 కేలరీలు వస్తాయి. పానీపూరీ తేలిక పదార్థం అనుకుంటాం గానీ అది గ్రహించే నూనె చాలా ఎక్కువ. అంటే ఒక కేకుముక్క, ప్లేటు పానీపూరీల కన్నా మామిడి పండు వల్ల వచ్చే కేలరీలు తక్కువే కదా.

READ ALSO : Cherry Tomatoes : చెర్రీ టొమాటోలు క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయా ?

అరటిపండులో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం లాంటివి ఎక్కువ. కీరాదోస, ఆకుకూరల వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఏమాత్రం ఉండదు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఆహారాన్ని అధికంగా తీసుకునే అవకాశం ఉండదు. తద్వారా బరువు పెరగకుండా నివారించవచ్చు. అంటే పళ్లు, కూరగాయల ద్వారా బరువు పెరగడం కాదు.. తగ్గుతారు.

ట్రెండింగ్ వార్తలు