Holiday weight gain : పండగల్లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

పండగ అనేసరికి సెలవలు వస్తాయి. సెలవలు అనగానే కాస్త రిలాక్స్ అవుతాం. నచ్చిన ఫుడ్ కంట్రోల్ లేకుండా తినేస్తాం. తరువాత బరువు పెరగ్గానే ఆందోళన పడతాం. హాలీడేస్‌లో బరువు పెరిగితే ఎలా తగ్గించుకోవాలి?

Holiday weight gain : పండగల్లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

Holiday weight gain

Holiday weight gain : పండుగలు.. హాలీడే అంటే కాస్త రిలాక్స్ అవుతారు. భోజనాలు, పార్టీల్లో ఫుడ్ ఆస్వాదిస్తారు. ఇక అక్కడి నుంచి కాస్త బరువు పెరగ్గానే ఆందోళన పడిపోతారు. కొంచెం క్రమశిక్షణ ఉంటే ఈ ఆందోళన అవసరం ఉండదు.

Burn Belly Fat : ఈమూడు ఆహారాలు పొట్ట వద్ద కొవ్వును కరిగించటంతోపాటు బరువును తగ్గిస్తాయి

పండుగలు, లేదా వరుసగా సెలవులు రావడం అందరూ ఇష్టపడతారు. కాస్త ఒత్తిడి నుంచి బయటపడేందుకు కాస్త రిలాక్స్‌గా నచ్చిన ఫుడ్ తినేందుకు సమయం దొరికిందని సంతోష పడతారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు క్రమశిక్షణ లేకుండా తినేస్తారు. బరువు పెరుగుతుంటారు. విశ్రాంతి తర్వాత ట్రాక్‌లో పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, లైఫ్ స్టైల్ అనుసరిస్తూ అదనపు బరువును తగ్గించుకోవాలి.

బరువు పెరగడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే నీరు ఎక్కువగా తాగండి. అలా చేయడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. దాంతో అతిగా తినకుండా ఉంటారు. చాలామంది పండుగల్లో, సెలవుల్లో రకరకాల ఫుడ్ తయారు చేసుకుని తింటారు. తర్వాత బరువు తగ్గించుకునే టైం కాబట్టి ప్రతిరోజు సలాడ్, పండ్ల రూపంలో ఫైబర్ ను చేర్చడం చాలా మంచిది. తాజా కూరగాయలు తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని కలిగి ఉంటాయి. మీరు తినే ఫుడ్‌లో తక్కువ నూనె, కొవ్వులను యాడ్ చేసుకోవడం చాలా మంచిది.

Eating Fast : ఆహారాన్ని వేగంగా తినటం వల్ల బరువు పెరుగుతారా ?

హాలీడేస్‌లో పెరిగిన బరువు తగ్గించుకోవడం కోసం తర్వాత కొందరు భోజనం మానేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. అతిగా తినకుండా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక బరువును తగ్గించుకోవాలంటే నిద్ర చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. హాలీడేస్‌లో రాత్రిపూట పార్టీలు చేసుకుంటారు. అప్పుడు తగినంత నిద్ర దొరకదు. హాలీడేస్ పూర్తయ్యాక నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. కనీసం 6 నుండి 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి సెలవులు పెడుతుంటారు. అలాంటి వారు హాలీడేస్ తరువాత ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయడం, ఇష్టమైన ఆర్ట్ నేర్చుకోవడం ఇవి ఒత్తిడిని దూరం చేయడానికి సాయపడతాయి. హాలీడేస్ వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఇలాంటి కొన్ని చిట్కాలను పాటిస్తూ బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు.