Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..

సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది.

Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..

Cervical Spondilosys

Updated On : June 28, 2022 / 10:48 PM IST

Cervical Spondylosis: సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. మెడ ఆర్థరైటిస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

చికిత్స తీసుకోకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాణాంతకంగా మారుతుంది. మెడ నొప్పి నియంత్రణలో ఉంచడానికి సకాలంలో వైద్యుల్ని సంప్రదించడం అవసరం. అలా చేయాలంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు తెలుసుకోవాలి.

  1. మెడలో దీర్ఘకాలిక నొప్పి
  2. చేతులు, భుజాలలో ఆకస్మిక నొప్పి
  3. నిరంతర తలనొప్పి
  4. మీరు మీ మెడను కదిలించినప్పుడు గుచ్చుకుంటున్నట్లు ఫీలింగ్. 
  5. చేతులు, కాళ్ళలో వివరించలేని బలహీనత
  6. భుజాలు, చేతులు లేదా చేతుల ప్రాంతంలో తిమ్మిరి.
  7. మెడ బిగుసుకుపోవడం.
  8. శరీర సమతుల్యతను కాపాడుకోలేకపోవడం

Read Also: మెడనొప్పికి దారితీసే రోజువారి పొరపాట్లు..!