నిమిషానికి 95 ఆర్డర్లు: భారత్‌లో ఎక్కువ తిన్న వంటకం ఇదే

నిమిషానికి 95 ఆర్డర్లు: భారత్‌లో ఎక్కువ తిన్న వంటకం ఇదే

Updated On : December 24, 2019 / 5:00 AM IST

ఈ సంవత్సరంలో ఇండియన్స్ బాగా ఎక్కవ తిన్న వంటకం ఏంటో తెలుసా.. చికెన్ బిర్యానీ. అందులో ఆశ్చర్యమేమీ లేదు. స్విగ్గీ, జొమాటలలో ఆర్డర్ బుక్ చేసుకుని తినేవాళ్లు పెరిగిపోయారు.  ఈ క్రమంలో 2019లో స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని తిన్నవారి లిస్ట్ విడుదల చేసి బిర్యానీనే టాప్ ప్లేస్ దక్కించుకుందని తెలిపింది. నాలుగేళ్లుగా ఇదే క్రేజ్‌తో నడుస్తున్త వంటకం ఇండియాలోనే అత్యధికంగా ఆర్డర్ చేసిన లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది. 

ప్రతి నిమిషానికి దేశం మొత్తంలో 95బిర్యానీల ఆర్డర్ వస్తున్నాయంట. దీనిని బట్టే తెలుస్తోంది భారత్‌లో బిర్యానీని ఎంత ఇష్టపడుతున్నారో.. ఇంకా పూణెలో చికెన్ సాజుక్ బిర్యానీ రూ.1500కు అమ్ముడుపోయి అత్యంత ఖరీదైన బిర్యానీగా ఘనత దక్కించుకుంది. మరోవైపు ముంబై వెజిటేరియన్ చల్ ధన్నో తవా బిర్యానీ(ఎకా పలావ్) రూ.19కే దొరికి అత్యంత తక్కువ ధరకు అమ్ముడుపోయిన బిర్యానీగా లిస్ట్‌లోకి ఎక్కింది. 

స్వీట్ ఇష్టపడేవాళ్లు గులాబ్ జామున్‌ను 17లక్షల 69వేల 399ఆర్డర్లు ఇచ్చారట. ఇదే టాప్.. రెండో స్థానంలో 11లక్షల 94వేల 732ఆర్డర్లు వచ్చాయి. డిస్సెర్ట్స్ కేటగిరీలో డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్, తిరామిసు ఐస్ క్రీమ్, కేసర్ హల్వా లు నిలిచాయి. ఈ ఏడాది మరో ఫేవరేట్ ఫుడ్ కిచిడి. నవరాత్రి సీజన్లో 128శాతం అమ్మకాలు పెరిగాయి. 

స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టాప్ 10ఫుడ్ ఐటెమ్స్:

  1. చికెన్ బిర్యానీ
  2. మసాలా దోశౌ
  3. పన్నీర్ బటర్ మసాలా
  4. చికెన్ ఫ్రైడ్ రైస్
  5. మటన్ బిర్యానీ
  6. చికెన్ ధమ్ బిర్యానీ
  7. వెజ్ ఫ్రైడ్ రైస్
  8. వెజ్ బిర్యానీ
  9. తందూరీ చికెన్ 
  10. దాల్ మఖానీ