Diabetic Footwear: డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేకమైన చెప్పులు అవసరమా..
డయాబెటిక్ శారీరకంగా, మానసికంగా బాధపెడుతుంది. అందరిలో ఉన్నా.. కంఫర్ట్ గా ఉండలేం. అందరిలా తిననీయదు. అన్నింటిలోనూ అసౌకర్యం చంపేస్తుంది. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి ప్రత్యేకమైన చెప్పులు వేసుకోమని చెప్తుంటారు డాక్టర్లు.

Diabetic
Diabetic Footwear: డయాబెటిక్ శారీరకంగా, మానసికంగా బాధపెడుతుంది. అందరిలో ఉన్నా.. కంఫర్ట్ గా ఉండలేం. అందరిలా తిననీయదు. అన్నింటిలోనూ అసౌకర్యం చంపేస్తుంది. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి ప్రత్యేకమైన చెప్పులు వేసుకోమని చెప్తుంటారు డాక్టర్లు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. భారత్‌లో 20-70 సంవత్సరాల వయసువారిలో 8.7% మధుమేహ రోగులే. వీరిలో 7 కోట్ల 70 లక్షల మందికి డయాబెటిక్ సమస్య ఉంది. ఈ మధుమేహ వ్యాధి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకూ కారణం అవుతుంది. ఆ ప్రభావంతో అవయవాలు దృఢత్వాన్ని కోల్పోయి, పాదాలు దెబ్బతింటాయి.
కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకమూ అవుతుంది. మధుమేహం వల్ల ప్రతి 20సెకన్లకు ఒక పాదం తెగిపోతున్నదని స్టడీలో తెలుస్తుంది.
Read Also : డయాబెటీస్ ను అదుపులో ఉంచే కీరదోస!
కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ సమస్యను తప్పించేందుకు డయాబెటిస్ బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు ప్రత్యేకంగా 3డీ ప్రింటెడ్ పాదరక్షలు అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ చెప్పులు డయాబెటిక్ రోగుల నడక తీరును నియంత్రించి, గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయటని చెప్తున్నారు.