Diabetics : మధుమేహులు క్యాబేజీ తినిటం మిస్ కావొద్దు! అసలు విషయం తెలిస్తే?
క్యాబెజీ రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యం చేస్తుంది. కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

Diabetics should not miss eating cabbage! If you know the truth?
Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులు తినే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినే వ్యక్తుల్లో రక్తపోటు లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన సూక్ష్మపోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో చేర్చుకోవాల్సిన కూరగాయల్లో ముఖ్యమైనది క్యాబేజీ. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ కె, మాంగనీస్, ఫైబర్ మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేసేందుకు క్యాబేజీ తోడ్పడుతుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనే ముఖ్యమైన ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది, ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
అంతేకాకుండా క్యాబెజీ రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యం చేస్తుంది. కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది ఈ క్యాబేజీని తినడానికి ఇష్టపడరు. అయితే షుగర్ బాధపడుతున్నవారు క్యాబేజీని తినటం మిస్ చేసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీని ఆహారంలో ఏ రూపంలోనైనా చేర్చుకోవచ్చు. వారంలో మూడుసార్లు పప్పుతో కలిసి వండుకోవచ్చు. క్యాబేజీ జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. సలాడ్ లో కూడా క్యాబేజీని చేర్చుకోవచ్చు.