Eating Chicken : చికెన్ తినటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది తెలుసా?
మెదడు పనితీరులో పాలుపంచుకునే విటమిన్లు మరియు ఖనిజాలు చికెన్ లో ఉంటాయి. విటమిన్ B12 మరియు కోలిన్ ఉంటాయి, ఇవి పిల్లలలో మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడంలో తోడ్పడతాయి.

Eating Chicken
Eating Chicken : మాంసాహారంతో కూడా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మాంసాహారాలలో చికెన్ కు మంచి ఆధరణ ఉంది. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని ఆరగించవచ్చు. చికెన్ చాలా పోషకమైనది, ప్రోటీన్ యొక్క మంచి మూలం. చికెన్ లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. బరువు తగ్గడం, కండరాల పెరుగుదల మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
చికెన్ తక్కువ కొవ్వు శాతాన్ని కలిగి ఉంటుంది. తొడ మరియు బ్రెస్ట్ మీట్‌లో 1 గ్రాము మాంసానికి 60 మి.గ్రా. కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ మాంసంలో ప్రొటీన్లు మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల మాంసంలో 20 గ్రాముల ప్రోటీన్తో చికెన్ అద్భుతమైన మాంసకృతుల వనరుగా ఉంటుంది. పిల్లల పెరుగుదలకు మరియు కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. చికెన్ లో నియాసిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. చికెన్ ఆయిల్ వేయకుండా వండుకోని తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మెదడు పనితీరులో పాలుపంచుకునే విటమిన్లు మరియు ఖనిజాలు చికెన్ లో ఉంటాయి. విటమిన్ B12 మరియు కోలిన్ ఉంటాయి, ఇవి పిల్లలలో మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడంలో తోడ్పడతాయి. పెద్దవయసు వారిలో మెదడు పనితీరుకు సహాయపడతాయి. A, B6, B12, నియాసిన్, థయామిన్, రివోఫ్లాబిన్ వంటి విటమిన్లు మరియు ఇనుము, జింక్, మెగ్నీషియం, పొటాషియం , ఫాస్పరస్ వంటి ఖనిజాలు చికెన్ లో అధికంగా ఉంటాయి.
సులభంగా జీర్ణమయ్యే మాంసకృత్తులు చికెన్ ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇందులో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు. స్కిన్ లెస్ చికెన్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కోడి మాంసం చాలా ఆరోగ్యంగా ఎంతో రుచిగా ఉండటం వలన, వంటలలో దీనిని రక రకాలు రూపాలలో చికెన్ ఉత్పత్తులుగా ఉపయోగిస్తున్నారు.