Black Ants : మీ ఇంట్లోకి నల్ల చీమలు లైను కట్టి వస్తున్నాయా .. ? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?!

టీమ్ వర్క్ కు ప్రతిరూపం చీమలు. చీమల దండు అంటారే అందుకే. చిన్న చిన్న చీమలు పెద్ద సర్పాని అంతమొందించాయని కథల్లో చదువుకున్నాం. చిన్న చిన్న చీమలు పెద్ద పెద్ద పనులు చేస్తుంటాయి. అటువంటి చీమలు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Black Ants : మీ ఇంట్లోకి నల్ల చీమలు లైను కట్టి వస్తున్నాయా .. ? అయితే ఏం జరుగుతుందో తెలుసా..?!

Black ants Come In House

Updated On : November 1, 2023 / 3:15 PM IST

Black ants Come In House : ఇల్లు అన్నాక చీమలు ఉండటం సర్వసాధారణమైన విషయం. ఇంట్లో ఎక్కడన్నా చీమలు కనిపిస్తే ఏదోక మందు వేసి చంపేస్తాం. ఒకప్పుడు పంచదార డబ్బా మూత తీస్తే చీమలు కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. కానీ చీమల్ని చూసి ఛీ చీమలు అంటూ చులకనగా చూస్తాం. కానీ చీమల్ని చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలానే ఉందని చెప్పి తీరాల్సింది.

టీమ్ వర్క్ కు ప్రతిరూపం చీమలు. చీమల దండు అంటారే అందుకే. చిన్న చిన్న చీమలు పెద్ద సర్పాని అంతమొందించాయని కథల్లో చదువుకున్నాం. చిన్న చిన్న చీమలు కలిసి పెద్ద పెద్ద వస్తువుల్ని..ఆహార పదార్ధాల్ని మోసుకుపోవటం చూసి ఉంటాం. కానీ చీమల్ని పెద్దగా పట్టించుకోం. చీమలు టీమ్ వర్కుకే కాదు క్రమశిక్షణకు మారుపేరు. అంతేకాదు నిరంతర కష్టజీవులు. ఏ చీమా కూడా సోమరిగా ఉండదు. ఏదోక పని చేస్తుంటుంది.

అటువంటి చీమల్లో ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ఉంటాయి. చీమల్లో చాలా రకాలే ఉన్నా ఈ రెండు రంగుల చీమలే మనకు బాగా పరిచయం. అటువంటి చీమలు మీ ఇంట్లో కనిపిస్తే చంపేయొద్దు. మరీ ముఖ్యంగా ఇంట్లోకి నల్ల చీమలు లైను కట్టి వస్తుంటే చూసి ఆనందపడండి.ఎందుకంటే అలా నల్ల చీమలు లైను కట్టి ఇంట్లోకి వస్తే ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీమలు మంచి చెడులను సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Nutritional Deficiencies in Women : మహిళల్లో కనిపించే 5 సాధారణ పోషక లోపాలు…లక్షణాలు, పరిష్కారాలు

ఇంట్లో కానీ నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతం అని చెబుతున్నారు.నల్ల చీమలు ఇంట్లోకి రావటం మంచిదని చెప్పే పండితులే మరీ గుట్టలు గుట్టలుగా ఇంట్లో నల్ల చీమలు ఉండటం కూడా మంచిది కాదని చెబుతున్నారు.అదే ఎర్ర చీమలు మంచిది కాదట. ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులు అంటూ నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయట. కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలంటాయని..ఇంటి టెర్రస్ పైన కనిపిస్తే మరో ఆస్తి అంటే స్థలం, పొలం, లేదా ఇల్లు వంటివి కొనుక్కుని అదృష్టం కలుగుతుందట. అలాగే చీమలు ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే ఆ ఇంట్లో నివసించేవారి జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని..అదే పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయని చెబుతుంటారు. దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే ధనలాభం కలుగుతుందట.తూర్పు దిశ నుండి చీమలు బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. ఆ అదృష్టం ఏ రూపంలో అయినా కలగొచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లోకి నల్ల చీమలు వస్తే ఏ చీమల మందో వేసే చంపేయొద్దని..మీ కోసం కలిసి వచ్చే అదృష్టాలేమిటో గమనించాలని సూచిస్తున్నారు.