Different Types of Tears : కన్నీళ్లలో ఇన్ని రకాలున్నాయా?
బాధ కలిగితే కన్నీరు వస్తుంది. ఉల్లిపాయ తరిగితే కన్నీరు వస్తుంది. నవ్వినా కన్నీరు వస్తుంది. భావోద్వేగాలు వేరైనట్లే.. కన్నీటిలో రకాలున్నాయట. నిజమేనా?

Different Types of Tears
Different Types of Tears : బాధ కలిగితే కన్నీరు వస్తుంది. ఉల్లిపాయ తరిగితే కన్నీరు వస్తుంది.. రకరకాల భావోద్వేగాల్ని బట్టి కన్నీరు వస్తుంది. అయితే కన్నీటి మధ్య తేడా ఉందని ఓ ఫోటోగ్రాఫర్ చెప్పిన మాటల్లో నిజమెంత?
Foods to Help Fight Stress : ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన 5 ఆహారాలు ఇవే ?
పలు కారణాల వల్ల కన్నీరు వస్తుంది. కన్నీరు కంటిని సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెడికల్ సెంటర్ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన డాక్టర్ మైఖేల్ రోయిజెన్ ప్రకారం భావోద్వేగ కారణాల వచ్చే కన్నీరు వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయట. ఒత్తిడి తగ్గుతుందట. ఒక వ్యక్తి దుఃఖం, సంతోషం, భయం లేదా ఇతర భావోద్వేగాలను అనుభవించినప్పుడు వచ్చే కన్నీటిలో అదనపు హార్మోన్లు, ప్రోటీన్లు ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అయితే భిన్న భావోద్వేగాలపై ఆధారపడిన కన్నీళ్లు విభిన్న పరమాణువులను కలిగి ఉంటాయి. ఇవన్నీ మైక్రో స్కోప్ ద్వారా చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. “ది టోపోగ్రఫీ ఆఫ్ టియర్స్” పుస్తకం కోసం ఫోటోగ్రాఫర్ రోజ్-లిన్ ఫిషర్ తీసిన ఫోటోలు గమనిస్తే ఈ తేడా కనిపిస్తుంది. “కన్నీళ్ల దృశ్య పరిశోధన” కోసం ఫిషర్ డిజిటల్ మైక్రోస్కోపీ కెమెరాలో ఆప్టికల్ స్టాండర్డ్ లైట్ మైక్రోస్కోప్‌ని ఉపయోగించి కొన్ని ఫోటోలను తీసారట. ఈ ప్రాజెక్ట్ కోసం రోజ్ లిన్ ఫిషర్ తన భావోద్వేగాలతో కూడిన కన్నీటిని 8 సంవత్సరాలు సేకరించి ఫోటోలు తీశారట. ఈ పరిశోధనలో కన్నీరు రకరకాలుగా ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసిందట. బాధలో ఉన్నప్పుడు, ఆనందం కలిగినపుడు కన్నీళ్లు చూడటానికి ఒకే రూపంలో ఉన్నాయట. దుఃఖం, నవ్వు మరియు ఉల్లిపాయ తరిగినపుడు వచ్చే కన్నీరు వేర్వేరుగా ఉన్నాయట.
Anxiety Disorders : ఆందోళన మిమ్మల్ని నియంత్రించేలా చేస్తుందా? సంకేతాల విషయానికి వస్తే..
రోజ్-లిన్ ఫిషర్ సైటింస్ట్ కాదు.. విజువల్ ఆర్టిస్ట్‌గా మాత్రమే తాను ఈ ప్రాజెక్టు ఆసక్తితో చేసినట్లు చెప్పింది. ఏది ఏమైనా సూక్ష్మదర్శినిలో చూసినపుడు కన్నీళ్లు విభిన్నంగా కనిపించాయట. అయితే ఈ ప్రక్రియకు శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవంటూ చాలామంది కొట్టివేసారు.. కేవలం ఇవి సృష్టించబడినవిగా వాదించారట. మరి ఈ విషయంపై పూర్తిగా పరిశోధనలు జరిగితేనే అసలు విషయం తెలియాల్సి ఉంటుంది.