మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే వెంటనే.. 

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 09:19 AM IST
మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే వెంటనే.. 

Updated On : December 31, 2019 / 9:19 AM IST

మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా..? కానీ ఈ అలవాటు ఉన్నవాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. గోర్లు కొరకడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురౌతున్నట్లే. గోర్లు కొరకడం అరిష్టం అని కూడా పెద్దవాళ్లు అంటుంటారు. అంతేకాదు మీ ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కుడా ఆపదలోకి నెట్టేస్తున్నట్టే. అంతేకాదు ఈ అలవాటు ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టే. 

ఇక చిన్నపిల్లల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. గోర్లు కొరికే టైంలో మనం వారిని తిట్టామనుకోండి, ఆ అలవాటు పెరిగే తగ్గకపోగా ఇంక పెరగచ్చు. అందుకే వారిని తిట్టకుండా మెల్లగా వేరే పనిలోకి వారిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి.  లేదా వాళ్లతో ఏదో ఒక ఆట ఆడండి. ఇలా వాళ్లని చెడు అలవాటు నుంచి డైవర్ట్ చేయండి.

మీరు గోర్లను కొరకడం ద్వారా మీ గోర్లలోని బ్యాక్టీరియా బాడీలోకి వెళుతోంది. అంతేకాదు paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఇంకా డేంజరస్ విషయమేంటంటే ఈ అలవాటు ద్వారా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు చెబుతుంటారు. కాబట్టి ఇప్పటికైనా గోర్లు కొరకడం ఆపండి.