Walking 10,000 Steps : రోజూ నడవండి.. అదే పదివేలు..! ఆరోగ్యానికి నిజంగా నడక అవసరమా?

నడకతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే మాట నిజమే కావొచ్చు.. కానీ, రోజూ నడవడం మంచిదేనా? రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10వేల అడుగులు అవసరమా? నిపుణులు ఏమంటున్నారంటే?

Walking 10,000 Steps : రోజూ నడవండి.. అదే పదివేలు..! ఆరోగ్యానికి నిజంగా నడక అవసరమా?

Do We Really Need To Take 10,000 Steps A Day For Our Health

Updated On : July 9, 2021 / 10:29 PM IST

Walking 10,000 Steps : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. వ్యాయామం తప్పనిసరి.. అందుకే నడక మంచిదే.. దీర్ఘాయువును పెంచుతుందని అంటారు.. చక్కగా ఆరోగ్యంతో ఉండొచ్చు.. గుండె లయను కంట్రోల్ చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులను దరిచేరకుండా నిరోధిస్తుంది.. నడకతో ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే మాట నిజమే కావొచ్చు.. కానీ, రోజూ నడవడం మంచిదేనా? రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10వేల అడుగులు అవసరమా? ఇలాంటి ఎన్నో సందేహాలకు ఆరోగ్య నిపుణుల అంచనాలే సమాధానాలు.. వాస్తవానికి చాలామంది రోజుకు పదివేల అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. అమెరికా, కెనడా సహా ఇతర పాశ్చాత్య దేశాలలో చాలా మంది రోజుకు సగటున 5,000 అడుగుల కన్నా తక్కువగా పూర్తి చేశారట. మంచి ఫిట్ నెస్ సాధించడానికి రోజుకు 10వేల అడుగులు అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పరిశోధకులు ఫిట్‌నెస్ ట్రాకింగ్ డివైజ్‌ల సాయంతో రోజుకు పదివేల అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణుడు డాక్టర్ I-Min Lee ప్రకారం.. పదివేల అడుగుల లక్ష్యం 1960లలో జపాన్‌లో ప్రాచుర్యం పొందినట్టు తెలిపారు. అప్పట్లో గడియారాల తయారీదారు ఫిట్‌నెస్‌పై ఆసక్తితో మనిషిని నడక పోలి ఉండే పేరుతో ఒక పెడోమీటర్‌ (pedometer)ను ఉత్పత్తి చేశాడు. దశాబ్దాలుగా ఫిట్నెస్ ట్రాకర్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీర్ఘాయువుగా ఉండాలంటే రోజుకు పదివేల అడుగులు వేయాలట.. అంటే 5 మైళ్ల దూరం నడవాల్సి ఉంటుంది. 2019 అధ్యయనంలో.. 70 ఏళ్ల మహిళలు రోజుకు 4,400 అడుగుల కంటే తక్కువ అడుగులు వేశారట. రోజుకు 2,700 లేదా అంతకంటే తక్కువ అడుగులు పూర్తి చేసిన మహిళలతో పోలిస్తే.. వీరిలో అకాల మరణ ముప్పు 40 శాతం తగ్గినట్టు గుర్తించారు. రోజుకు 5వేల అడుగులకు పైగా నడుస్తున్న మహిళల్లో అకాల మరణాలు తగ్గుతూనే ఉన్నాయి. కానీ, రోజువారీ 7,500 అడుగులతో ఆరోగ్యపరంగా ప్రయోజనాలు మరోలా ఉంటున్నాయి.

Do We Really Need To Take 10,000 Steps A Day For Our Health (1)

దీర్ఘాయువుకు రోజుకు పదివేల అడుగులు అక్కర్లేదు :
అప్పట్లో వృద్ధ మహిళలు రోజువారీగా పదివేలు అడుగుల్లో సగం కంటే తక్కువ పూర్తి చేశారు. అయినా వారంతా ఇతరుల కంటే ఎక్కువ కాలం జీవించారు. గత ఏడాదిలో దాదాపు 5వేల మంది మధ్య వయస్సు పురుషులు, మహిళలపై అధ్యయనాన్ని నిర్వహించారు. దీర్ఘాయువు పొందాలంటే రోజుకు పదివేల అడుగులు అవసరం లేదని అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయనంలో రోజుకు సుమారు 8వేల అడుగులు నడిచిన వ్యక్తులు గుండె జబ్బులు లేదా మరే ఇతర కారణాలతో అకాలంగా చనిపోయే అవకాశం ఉంది. వాస్తవికంగా.. మనలో కొద్దిమంది మాత్రమే పదివేల అడుగుల లక్ష్యాన్ని చేరుకుంటారు.

Do We Really Need To Take 10,000 Steps A Day For Our Health (2)

అధ్యయనంలో భాగంగా 2005లో కొంతమందికి పెడోమీటర్లను అందించారు.. ఏడాదికి రోజుకు కనీసం పది వేల అడుగులు నడవమని వారిని ప్రోత్సహించారు. అధ్యయనం పూర్తి చేసిన 660 మంది పురుషులు, మహిళలలో 8శాతం చివరికి పదివేల అడుగులు రోజువారీ లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ, నాలుగు ఏళ్ల తరువాత అధ్యయనంలో, దాదాపు ఎవరూ ఇంకా అంతకంటే ముందుగా వెళ్లలేదని గుర్తించారు. రోజువారీ జీవితంలో వారానికి కనీసం 150 నిమిషాలు లేదా అరగంట వ్యాయామం చేయాలని సూచిస్తున్నాయి. ప్రస్తుతం షాపింగ్, ఇంటి పనులు వంటి రోజువారీ కార్యకలాపాల కోసం రోజుకు ఐదు వేల అడుగులు వేస్తే.. అదనంగా రెండు వేల నుంచి మూడు వేల 3,000 అడుగులు వేయాలని సూచిస్తున్నారు. అలా అలవాటు పడితే నెమ్మదిగా మొత్తంగా 7వేల నుంచి 8 వేల అడుగుల వరకు చేరుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.