Weight Loss : బరువు తగ్గేందుకు చపాతీలు రోజుకు ఎన్నితినాలో తెలుసా?..

చపాతీలో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది.

Weight Loss : బరువు తగ్గేందుకు చపాతీలు రోజుకు ఎన్నితినాలో తెలుసా?..

Chapathi

Updated On : August 13, 2021 / 12:39 PM IST

Weight Loss : బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో అనేక మార్పులు చేస్తున్నారు. అన్నానికి బదులుగా చపాతీలు తింటే అతిసులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బరువు తగ్గటం కోసం చపాతీలను తింటున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి చపాతీ బాగా ఉపయోగపడుతుంది.

చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చపాతీలను తయారుచేసేందుకుఉపయోగించే గోదుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేయటంలో సహాయపడుతుంది. బరువు పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారు చపాతీలు తినంటం మంచిది.

చపాతీలో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. చపాతీ చేసుకొనే సమయంలో నూనె వాడకుండానే కాల్చుకుని తినాలి. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీలు తింటే జీర్ణ వ్యవస్ధ బాగా ఉంటుంది. నిజానికి చాలా మంది పిండిపదార్ధాలు అధికంగా ఉండే గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే బరువు పెరుగుతామన్న ఆందోళనలో ఉంటారు.

చపాతీలను ఆహారంలో బాగం చేసుకునేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. బరువు తగ్గాలనుకునే చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలు తింటుంటారు. కొంత మంది రాత్రి సమయంలో మాత్రమే చపాతీలు తింటారు. మరికొందరు పగలు, రాత్రి రెండు పూటలా చపాతీలు తింటారు. గోధుమల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించేందుకు దోహదపడుతుంది.

అసలు చపాతీలు తినేవారు రోజులో ఎన్ని చపాతీలు తినాలన్న దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. చాలా మంది చపాతీలు తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారని అదేపనిగా రోజుకు అధిక సంఖ్యలే చపాతీలను తినేస్తుంటారు. అలాంటి వారు బరువు తగ్గకపోను బరువు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో చపాతీలను నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

చపాతీలను ఆహారంగా తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగవు. 6ఇంచుల సైజులో ఉండే చిన్న చపాతీలో 71 క్యాలరీలు ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవాలనుకునేవారు మధ్యాహ్నం సమయంలో 2 చపాతీలను, రాత్రి సమయంలో 2 చపాతీలను మాత్రమే తీసుకోవాలి. అంటే రోజుకు నాలుగు చపాతీలను తీసుకుంటే సునాయాసంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చపాతీలలో క్యారెట్, బీట్ రూట్, కీరదోస, టమాటా వంటి కూరగాయలతో చేసిన సలాడ్ లను తీసుకోవచ్చు.