Bitter Taste In Mouth : నోటిలో చేదు లేదా చెడు రుచికి కారణాలు తెలుసా ?
బ్యాక్టీరియా, చిగుళ్ల వ్యాధి, నోటి అంటువ్యాధులు చేదు రుచి కారణమవుతాయి. రెగ్యులర్ డెంటల్ చెక్-అప్‌లు, మంచి నోటి పరిశుభ్రత కలగి ఉండటం ద్వారా సమస్యలను నివారించవచ్చు.

Bitter Taste In Mouth
Bitter Taste In Mouth : అనేక సందర్భాల్లో చాలా మంది నోటిలో చేదు రుచి పరిస్ధితిని ఎదుర్కొని ఉంటారు. నోరంతా చేదుగా ఉండటం ఎందువల్లో అర్ధంకాక చాలా మంది ఆశ్ఛర్యపోవటమే కాదు, భయాందోళనకు లోనవుతుంటారు. నోటిలో శాశ్వతంగా ఉండే ఈ తరహా రుచికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Bad Breath : నోటి నుండి దుర్వాసన వస్తుందా? కిడ్నీ సమస్య లక్షణాల్లో ఇదీ కూడా ఒకటా?
నోటిలో చేదు రుచి ఎందుకంటే ;
1. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవటం ; నోటిలో చేదు రుచికి అత్యంత సాధారణ కారణం నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం. నోటిలో బ్యాక్టీరియా, పాచి, ఇతర ఆహార కణాలు పేరుకుపోతాయి, ఫలితంగా నోటి రుచి చేదుగా ఉండటంతోపాటు దుర్వాసన వస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు దంతాలను బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాస్ చేయడం , మౌత్ వాష్ ఉపయోగించడం వంటివి అనుసరించటం ద్వారా నోటిలో చేదు రుచిన పోగొట్టుకోవచ్చు.
2. నోరు పొడిబారటం ; నోటిలో తగినంత లాలాజలం ఉత్పత్తి జరగని సందర్భంలో నోరంతా చేదు రుచితోపాటు, లోహ రుచి అనుభూతి కలుగుతుంది. దీనినే జిరోస్టోమియా అని పిలుస్తారు. ఈ పరిస్థితి కొన్ని రకాల మందులు, నిర్జలీకరణం, కొన్ని జబ్బులకు చికిత్స పొందేవారిలో కనిపిస్తుంది. పుష్కలంగా నీరు త్రాగడం, లాలాజల-స్టిమ్యులేటింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
READ ALSO : Mouth Washes : నోటి పరిశుభ్రతలో ఉపయోగపడే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన మౌత్ వాష్ లు ఇవే!
3. యాసిడ్ రిఫ్లక్స్ ; కడుపులోని ఆమ్లం తిరిగి అన్నవాహికలోకి ప్రవహిస్తుంది. దీంతో నోటిలో చేదుగా, పుల్లని రుచి కలిగిస్తుంది. దీనినే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) గా పిలుస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నితీసుకోవటం ద్వారా ఈ పరిస్ధితిని నివారించవచ్చు.
4. సైనస్ ఇన్ఫెక్షన్లు ; సైనస్ ఇన్ ఫెక్షన్ ఉన్నవారిలో నోటి రుచిలో మార్పు వస్తుంది. అంతర్లీనంగా ఉన్న సైనస్ ఇన్‌ఫెక్షన్‌ను నాసికా డీకాంగెస్టెంట్స్, స్టీమ్ ఇన్‌హేలేషన్ లేదా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వల్ల లక్షణాలను తగ్గించవచ్చు.
READ ALSO : Mouth Cancer : నోటిలో క్యాన్సర్ పెరుగుదలను సూచించే సూక్ష్మ సంకేతాలు ఇవే!
5. మందులు ; యాంటీబయాటిక్స్, యాంటిడిప్రెసెంట్స్ , బ్లడ్ ప్రెజర్ డ్రగ్స్ వంటి కొన్ని మందులు నోటిలో చేదు రుచిని కలిగిస్తాయి. దీని నివారణకు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.
6. ధూమపానం ; ధూమపానం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటంతోపాటు, నోటిలో చేదు రుచికి కారణమౌతుంది. ధూమపానం మానేయడం , పొగాకు వినియోగాన్ని తగ్గించడం ద్వారా నోటిలోని నాలుకపై ఉన్న రుచి మొగ్గల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. చెడు వాసనను, రుచిని తొలగించుకోవచ్చు.
READ ALSO : MOUTH ULCERS : నోటిపూత సమస్యా? ఉపశమనానికి చిట్కాలు
7. చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారం ; అధిక మొత్తంలో చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల కూడా నోటిలో రుచి చేదుగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం ద్వారా నాలుకపై ఉండే రుచి మొగ్గల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
8. దంత సమస్యలు ; బ్యాక్టీరియా, చిగుళ్ల వ్యాధి, నోటి అంటువ్యాధులు చేదు రుచి కారణమవుతాయి. రెగ్యులర్ డెంటల్ చెక్-అప్‌లు, మంచి నోటి పరిశుభ్రత కలగి ఉండటం ద్వారా సమస్యలను నివారించవచ్చు. మొత్తం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
READ ALSO : Personal Hygiene : వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మంది పురుషులు తెలియకుండా చేసే 6 తప్పులు ఇవే !
9. జీవనశైలి మార్పులు ; అన్నవాహికలో వాపు వల్ల కూడా నోటిలో చేదు రుచి ఉంటుంది. కొద్దిమొత్తాల్లో భోజనం తీసుకోవటం ద్వారా, తిన్న వెంటనే నిద్రపోకుండా అటు ఇటు నడవటం వంటి జీవనశైలి మార్పులను అనుసరించాలి. తద్వారా లక్షణాలను తగ్గించుకోవచ్చు.
10. అలెర్జీలు ; కొన్ని ఆహారాలు, మందులు, పర్యావరణ కారకాలు అలెర్జీకి కారణమౌతాయి. వీటి వల్ల కూడా నోటిలో చేదు రుచి కలుగుతుంది. అలెర్జీ కారకాలను గుర్తించడం ,నివారించడం కోసం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం అవసరం.
READ ALSO : Zoonotic : పెంపుడు జంతువులతో అప్రమత్తత లేకుంటే… జూనోటిక్ వ్యాధుల ముప్పు తప్పదా?
మొత్తానికి నోటిలో చేదు రుచికి వివిధ పరిస్ధితులు కారణమౌతాయి. నోటి పరిశుభ్రత పాటించకపోవటం మొదలు, అనారోగ్య పరిస్ధితులు, చికిత్సల వరకు అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన రోగ నిర్ధారణ ద్వారా చికిత్స పొందటం ఉత్తమం.