Varicose Veins : వెరికోస్ వెయిన్స్ కు కారణాలు తెలుసా?

కొంత మందిలో సిరల్లో సామర్ధ్యం తగ్గటం కారణంగా రక్తం తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. సిరల్లోని కవాటలు బలహీనం కావటమే దీనికి కారణం. దీని వల్ల కాలి సిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. దీనిని వెరికోస్ వెయిన్స్ అంటారు.

Varicose Veins : వెరికోస్ వెయిన్స్ కు కారణాలు తెలుసా?

Varicose Veins

Updated On : July 26, 2022 / 12:37 PM IST

Varicose Veins : మనిషి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగటం చాలా అవసరం. సాధారణంగా గుండె పంపింగ్ చేసే రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. ఆక్సిజన్, ఇతర పోషకాలను ఆయా భాగాలు గ్రహించుకున్న తరువాత సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువెళతాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగిపోతే పర్వాలేదు. అయితే కొంత మందిలో సిరల్లో సామర్ధ్యం తగ్గటం కారణంగా రక్తం తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. సిరల్లోని కవాటలు బలహీనం కావటమే దీనికి కారణం. దీని వల్ల కాలి సిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. దీనిని వెరికోస్ వెయిన్స్ అంటారు.

రక్తప్రసరణ దెబ్బతినటం వల్ల మడమల నొప్పులు, వాపు , దురద, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా రావటానికి అనేక అంశాలు కారణంగా చెప్పవచ్చు. తల్లి దండ్రుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. పురుషుల కన్నా ఈ సమస్య స్త్రీలలో అధికంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు ఎక్కువ సేపు నిలబడటం వల్ల వెరికోస్ వెయిన్స్ దారితీసే అవకాశాలు ఉంటాయి. కదలకుండా పనులు చేసే వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన చికిత్స తీసుకోకుంటే సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర సమస్యకు దారి తీస్తుంది.

సిరలు ఉబ్బిన వారు కాళ్ల కింత ఎత్తుగా దిండు పెట్టుకుని నిద్రించాలి. సాక్సులు, పట్టీలు ధరించటం మంచిది. రక్త ప్రసరణ దెబ్బతినకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటే సిరలు ఉబ్బకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. పీచుతో కూడిన ఆహార పదార్ధాలను ఎక్కకువగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. కూర్చుని ఉన్న సమయంలో కాళ్లను కాస్త ఎత్తులో పెట్టుకోవాలి. గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చోవటం, నిల్చోవటం చేయకుండా మధ్యమద్యలో భంగిమలు మార్చాలి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్సను అందించేందుకు అవకాశం ఉంటుంది.