Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

థైరాయిడ్ హార్మోన్లు దాదాపు శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేయవచ్చు. హైపోథైరాయిడిజం ఉంటే, హృదయ స్పందన రేటు సాధారణం కంటే నెమ్మదిగా ఉంటుంది.

Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

hypothyroidism

Hypothyroidism : బరువు పెరగడం దగ్గరి నుంచి చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం… థైరాయిడ్ వచ్చిందంటే చాలు.. ఇలా రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. థైరాయిడ్సమస్య కంట్రోల్ లో లేకపోతే అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి. థైరాయిడ్ వచ్చిన తరువాత ఎక్కువ మంది ఇబ్బంది పడేది బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం గురించే. కానీ రెగులర్ గా థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ, కంట్రోల్ లో పెట్టుకుంటే ఏ సమస్యలూ ఉండవు.

READ ALSO : Hyperthyroidism : థైరాయిడ్ శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓవర్యాక్టివ్ థైరాయిడ్ యొక్క సంకేతాలు !

థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో చాలా కీలకమైనది. శరీరంలోని రకరకాల జీవక్రియలతో పాటుగా లైంగిక హార్మోన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీని పనితీరులో లోపం ఏర్పడితే థైరాయిడ్ హార్మోన్లో హెచ్చుతగ్గులు వస్తాయి. థైరాక్సిన్ హార్మోన్ తక్కువైతే హైపోథైరాయిడిజం గానూ, ఎక్కువైతే హైపర్ థైరాయిడిజంగానూచెప్తారు.

తక్కువైతే అన్నీ ఇబ్బందులే

థైరాయిడ్గ్రంధి తగిన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడుహైపోథైరాయిడిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగా అలసట, బరువు పెరగడం, నిరాశ, చర్మం నిర్జీవంగా మారడం, మలబద్ధకం, తరచుగా జలుబు వంటి అనేక లక్షణాలు ఉంటాయి.ఇకపోతేహైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడం వలన కలిగే పరిస్థితి. ఈ కారణంగా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, చిరాకు, ఆందోళన, నిద్రలేమి, హార్ట్ బీట్ పెరగడం, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

READ ALSO : Thyroid Gland : థైరాయిడ్ గ్రంధిని కాపాడే ధనియాలు

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అతి సాధారణంగా కనిపించే మార్పులు ;

అధిక బరువు లేదా బరువు తగ్గడం

బరువులో మార్పు అనేది థైరాయిడ్ సమస్యకు సంబంధించిన అతి సాధారణ సంకేతాలలో ఒకటి.థైరాయిడ్ హార్మోన్లు తక్కువైతే బరువు విపరీతంగా పెరుగుతారు. థైరాయిడ్ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే, బరువు తగ్గుతారు. . హైపర్ థైరాయిడిజంకంటే హైపోథైరాయిడిజం చాలా మందిలో సాధారణంగా కనిపిస్తుంది.

గొంతు వాపు

మెడ దగ్గర గొంతు వాపు థైరాయిడ్‌లో ఏదో లోపం ఉందనడానికి సంకేతం. థైరాయిడ్ గ్రంథి సైజు పెరగడం వల్ల సాధారణంగా గొంతు దగ్గర వాపు కనిపిస్తుంది. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంతో కూడా ఇలా కనిపించవచ్చు.  కొన్నిసార్లు మెడ దగ్గర వాపు థైరాయిడ్ క్యాన్సర్ లేదా థైరాయిడ్‌తో సంబంధం లేని కారణం వల్ల కూడా రావచ్చు. ఏది ఏమైనా ఈ లక్షణాన్ని మాత్రం అశ్రద్ధ చేయవద్దు.

READ ALSO : Thyroid : థైరాయిడ్ ఆరోగ్యానికి కొబ్బరితో మేలు

హార్ట్ బీట్ లో తేడాలు

థైరాయిడ్ హార్మోన్లు దాదాపు శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేయవచ్చు. హైపోథైరాయిడిజం ఉంటే, హృదయ స్పందన రేటు సాధారణం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఒకవేళ హైపర్ థైరాయిడిజం ఉంటే హార్ట్ బీట్ రేటు సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది.

మానసిక అశాంతి

థైరాయిడ్ రుగ్మతలు శరీరంలో శక్తి స్థాయిలు, మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. హైపోథైరాయిడిజం ఉన్న వ్యక్తులు త్వరగా అలసిపోతుంటారు. చాలా నిరాసక్తంగా నిరాశగా ఉంటారు. కొన్నిసార్లు డిప్రెషన్ కి కూడా గురవొచ్చు.  హైపర్ థైరాయిడిజం వల్ల ఆందోళన, నిద్రలో ఇబ్బంది, చంచలత్వం, చిరాకు ఉంటాయి.

READ ALSO : Blood Donation : రక్తదానం సురక్షితమేనా? మనం ఎన్నిరోజులకొకసారి రక్తదానం చేయవచ్చు?

పొడిచర్మం, జుట్టు రాలడం

థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడేవాటిలో చర్మం, జుట్టుకు సంబంధించిన అంశాలు కూడా ముఖ్యమైనవే. వీళ్లలో చర్మం చాలా పొడిగా తయారవుతుంది. మాయిశ్చరైజర్ ఎంత రాసినా వెంటనే పొడిగా అయిపోతుంటుంది. జుట్టు రాలడం అనేది థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యతకి మరో సంకేతం. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ జుట్టు రాలడానికి దారితీస్తాయి. అయితే చాలా సందర్భాలలో, థైరాయిడ్ కి చికిత్స చేసిన తర్వాత చర్మం మెరుగవడమే కాకుండా జుట్టు మళ్లీ పెరగవచ్చు.