Stomach Hurt : కడుపులో మంట బాధిస్తుందా! వీటితో సమస్యకు చెక్?

పిత్తం అధికంగా ఉన్న వారిలో, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో, వివిధ రకాల జబ్బులకు మందులు వాడుతున్న వారిలో, మద్యపానం, దూమపానం వంటి అవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Stomach Hurt : కడుపులో మంట బాధిస్తుందా! వీటితో సమస్యకు చెక్?

Gastric Problem

Updated On : April 1, 2022 / 10:54 AM IST

Stomach Hurt : కడుపులో చాతిలో మంటతో చాలా మంది బాధపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధిక శాతం మంది ఎదుర్కొంటున్నారు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావటానికి ఉత్పత్తి అయ్యే రసాలు, అమ్లాలు అవసరానికి మించి విడుదల అయినప్పుడు ఈ ఎసిడిటీ సమస్య ఉత్పన్నం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అమ్లాలు పైకి ఎగదన్నటం కారణంగా గుండెల్లో మంట వస్తుంది. నోట్లో పుల్లని నీళ్లు వస్తుంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఆహారాన్ని సమయానుకూలంగా తీసుకోకుండా ఆలస్యం చేస్తే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

పిత్తం అధికంగా ఉన్న వారిలో, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో, వివిధ రకాల జబ్బులకు మందులు వాడుతున్న వారిలో, మద్యపానం, దూమపానం వంటి అవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్ధితిని ఎదుర్కొంటున్న వారు కారం, పులుపు, మసాలాలు తీసుకునే ఆహారంలో తగ్గించుకోవటం మంచిది. నూనెల్లో వేయించిన ఫ్రైలు, మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు నిర్ణీత వేళల్లో ఆహారం తీసుకోవాలి. యాపిల్, తేనె, ఎండు ద్రాక్ష, మజ్జిగ, జీలకర్ర, పుదీనా, పెరుగు వంటి పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి వారు ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దికొద్ది మొత్తాల్లో ఆహారం తీసుకోవటం మంచిది.

కడుపులో మంట తగ్గాలంటే ;

బీట్ రూట్ రసం కడుపులో మంటకి మంచి మందులా పనిచేస్తుంది. రోజు ఉదయం కప్పు బీట్ రూట్ రసం తాగాలి. లేత కొబ్బరి నీళ్ళు సమస్యను తగ్గిస్తాయి రోజు లేత కొబ్బరిని నెమ్మదిగా నమిలి తినటం వల్ల ఎసిడిటీ అదుపులోకి వస్తుంది. జీలకర్ర ఎసిడిటీని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్ర వేయించి పొడి చేసి కప్పు నీల్ళు మరిగించి అందులో చెంచా జీలకర్ర పొడిని వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను వేసుకుని గోరువెచ్చగా తాగాలి. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తరువాత అరచెంచా సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి రసాన్ని మింగాలి. దీని వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. అతి మధురం ముక్కను నోట్లో పెట్టుకుని రసాన్ని మింగినా ఎసిడిటీ అదుపులోకి వస్తుంది. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవటం మంచిది.